పుట:Delhi-Darbaru.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
24
ఢిల్లీన గ ర చ రి త్ర ము.


పనము, మొదలగునవి ఢిల్లీకి సామాన్యములు. శతశతాబ్దములుగ ఢిల్లీ యాభరణములనిన ప్రపంచమంతయు గనులెత్తి చూచుచు వచ్చుచున్నది. అయిన నిక్కాలమం దచ్చట సిద్ధమగు భూష ణములు మొగలాయి యుగము నందలి నానియంతటి యపూ ర్వమయినవని చెప్పనొప్పదు. దంతము పై చెక్కిటపుఁబని యొకటి రెండు కుటుంబముల వారు మాత్రము చేయుచున్నారు. ఇటీవల నీవ స్తువుతో జిత్రమగు బహుమాన పేటిక లు (Caskets) మున్నగునవి చేయఁబడినవి. అత్యద్భుత సంపూర్ణ తాశక్తి (Power of finishing) చే నమర్పఁబడిన "రేఖానృత విశాల రూపము లే (Open-twork Geometric pattern) వీనియం దలి విశేషాంశము. కుమ్మరిపని యింకను నవీనము. ఇప్పుడిప్పుడే యొక రిద్దఱు పని వారలు నాణ్యతయంతగ లేని సింగాణీ సొమా నులఁ జేయుచున్నారు. వెండి బంగారు జరీతో జరుగుబుటేదారు పనిమాత్రము గొంచెమెక్కుడు ప్రాముఖ్యతగలది. ఇది చాందిని చౌకులో విశేషము నడుచుచున్నది. పాశ్చాత్య సంబంధ మచ్చటచ్చటఁ గొనుపించుచున్నను మొత్తముమీఁద దీని యందలి పౌరవాత్య కళాకౌశల్యమింకను దలయెత్తికొని యే యున్నది. ఈ పని కొఱకువలయు జరీ సిద్ధపఱుచుటలో నక్షకులకు జీవనము దొరకుచున్నది. వీరు మాత్రము గ్రామరక్షక సంఘము నకు (Municipality) సంవత్సరమునకు 25, 000 రూప్యముల పన్ను నిచ్చుచున్నారు. సంఘము వారు ప్రత్యుపకృతిగ ముఖ్య