జీవిత చరితావళి.
(మొదటి భాగము)
ఇందు మహాపురుషులగు మేశ చంద్రబసడ్లీ, గమేశ చంద్రదత్తు రంగా రావుగార్ల జీవితములు చక్కని వచన శైలిని రమ్యము గా వర్ణింపబడినవి. దేశముకొరకును, భాషకొరకును, అనేక విధముల తమ జీవితముల ధారపోసిన నీ మహనీయులుమనకందరికిని వంద్యులు. ఇంక వీరిజీవితములు పఠనాస్త్రము లని వేరుగనుక వవలెనా? ఆర్టు పేపరు మీద ముద్రించబడిన నీ దేశ భక్తుల రూపపటములతో సొగ సైన ఈ బైండు చేయబడి, నూనుపుటలకు పైగానుండు నీగ్రంథము వెల గు. 0-4-0 మాత్రమే. పోస్టుకర్చులు కొనువారే భరించవలెను. చిరు నామా :--- విజ్ఞానచంద్రికా బుక్కుడిపో, చింతాద్రి పేట - మదాసు.
మ నోరమ.
ఇది బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము గారిచేఁ బ్రచురింపఁబడు తెలుగు మాసపత్రిక. ఇందు వినోదములు దేశమునకు మతమునకు మహోప కారము చేసి కీ ర్తి శేషులయిన మహా పురుషుల జీవనచశత్రలు సృష్టియందలి వైచిత్ర్యములను దెలియ చేయు మహాద్భుతములు, గసవంతము లైన మృదు పద సంయుక్తములై యొప్పు నాటకములు నూతన కల్పనలతో నిండియుండి చదివిన కొలఁది చవులుగొల్పు చక్కనిక థలు, చిత్రకల్పనలతో రచియించిన చి చిత్ర వచన కావ్యముల (Novels) ప్రచురింపఁబడు చుండును. ఈ మాసపత్రికను జదివిన వారందఱు దీనిని భాషాప్రౌఢిమగల పత్రికలలో నొకటియనియుఁ బండితులకుఁ బామరులకు స్త్రీలకు బాలురకు నత్యంతో పయుక్త మనియు నీతి దాయకమనియుఁ దలంపకపోరు. చందా సంవత్సరమునకు మూడు రూపా యలు, వలయు వారు “మనోరమ పత్రికాధిపతిగారికి రాజమండ్రి" యని వ్రాసిన బడయగలరు. .