Jump to content

పుట:Delhi-Darbaru.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకటననియమములు.



1. మాకు 3000 మంది చందాదారులు కలరు. ప్రతి గ్రంథము యొక్క 4000 ల ప్రతులు అచ్చు వేయించుచున్నాము. మాగ్రంథములు స్త్రీలు, పురు షులు చదువుదురు. మాపుస్తకములు కొన్ని యూనివర్సిటీ పరీక్షలకు నియ మించియున్నారు. కొన్ని పాఠశాలలలో పఠనీయములు గా ఏర్పరచి చదివించు చున్నారు. ఈ గ్రంథమాఖకగల వ్యాపకము మరియే గ్రంథమునకును, ఏగ్రంధ మాలకును లేదు. కావున దీనియందు ప్రకటనలు వేయు వారికి అత్యంత లాభ కారి యని మేము వేరుగ వ్రాయనక్కర లేదు.

2.ప్రతి గ్రంథము యొక్క చివర కొన్ని ప్రకటనలు చేయుదుము. ఈప్రక టనలు కేవలము భాషా విషయకములు మాత్రమే యయియుండును.ప్రక టించము ఆంధ్రభాప లోని మందులుమొదలగునని మేముస్మృతులు, కావ్యములు, "నాటకము-~, నవలలు, ప్రహసనము N , దేశ చరిత్రలు, వాద పత్రికలు,పక్ష పత్రికలు, మాకు పత్రికలు మొదలగు వానిని గుఱించి ఏమి తెలిసికోవలసివచ్చినను, ఒక్కచోట చప్పున గనుపడునటుల చేయఁదల చినారము. కావునగ్రంథకర్తలు, పత్రికాధిపతులు తమ తమ గ్రంథములను, పత్రికలును, ఇందుప్రకటించి ఎక్కువలాభమును బడయుడుగని నమ్ముచున్నాము 3. మా ప్రకటనల తమ పత్రికలో వేయు పత్రికాధిపతుల ప్రకటనలు మా స్తకముల చివర నుచితము గా వేయఁగలవారము. 4. ఇతరులు ఒక సారి ఒక పుట ప్రకటన వేయుటకు గు. 10-0-0లు ఈయ వలెను. అగపుటకు 6.0-0 లు. ఒక్క-సారి నాలుగు పుటలు వేయువారికి రేటు తగ్గించఁబడును. అర పుటకన్న తక్కువ ప్రకటన తీసికొనఁబడదు. . 5. మాకు ప్రతిదినము క్రొత్తక్రొత్త చందాదారులు వచ్చుచున్నందునను, మాగ్రంథములు ఆంధ్రభాషలో శాశ్వతముగ నుండునవి గనుకను ఇందొక సారి ప్రకటన వచ్చినయెడల అది భాషలో శాశ్వతముగ నుండున . వారపత్రి కల, మాసపత్రికలవలె అప్పుడు మాత్రము చదివి ఆవల, బారవేయునట్టివి మాగ్రంథములు కావు. గనుక వీనియందు ప్రకటనలు వేయు వారికి మిక్కిలి లాభముండునని చెప్పవచ్చును.

మే నేజరు, విజ్ఞానచంద్రిక, చింతాద్రి పేట, మద్రాసు