పుట:Delhi-Darbaru.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ జార్జిపటాభి షేకము,

379


విచ్చేసి ప్రాచీన వైభ వోపేతయగు నీదేశమును గారవించి చారిత్రిక ప్రసిద్ధిగాం చిన ఢిల్లీ పురంబున సింహాసనబు నధిష్టించి ప్రజలకు సంతసం బొసంగ నొక కొన్ని వరంబులఁ బ్రసాదించి మనకిఁకముందు మునుపటికంటె నెక్కుడు శ్రేయస్సు గలుగఁ గలదను నమ్మకమును ప్రజలయందు గల్గించినాఁడు. కావున నాటి యుత్సనము నిచ్చట సంగ్రహముగ వర్ణించెదము. 12 వ తేది ప్రాతః కాలమయి కాకమునుపే ఢిల్లీదర్బారు రంగమునందలి భననములయందును పటకుటీరముల యందునుజనుల కలకలము విననయ్యెను. సూర్యోదయ మగునప్పటికి సైన్యము లెల్లెయును దముకు నియమితమయియుండిన స్థలములలో గాయక బృంద ములతో బారులు దీరెను. ధూమశకటపు ఘులును, గుఱ్ఱపు బుళ్లును, మోటారు బండ్లును, రిక్షాలును లక్షులు లక్షలుగ, జూపరులను దర్బాగు రంగమునకుఁ గొని వచ్చి వదల మొదలి డెను. సామాన్య ప్రజలు ఇసుక రాల్చినఁ గ్రిందికి పడనీయక తండోపతండములుగఁ బాదచారులయి రాఁజొచ్చిరి. 9. 30 గంటలకు పట్టాభిషేకమంటపమునకుఁ బ్రజ సాగిపోవఁ బ్రారం చిరి. పదిగంట లగునప్పటికీ సర్వమును సిద్ధమయ్యెను. దూర దేశాగతులయిన నానారాజ్య ప్రతినిధులును భూషణావళులచే సలంకరింపఁ బడిన స్వదేశ సామంతరాష్ట్రాధి పతులును, అధి కారులును, నాహూయమానులయి యుండిన ప్రజానాయ కులును తమ తమ స్థానముల నాసీనులయి యుండిరి. 20 వేలు