పుట:Delhi-Darbaru.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1877 వ సంవత్సరపు దర్బారు.

373


వసరము. అదున విక్టోరియా మహా రాజి రాజ్యమునకు వచ్చిన తోడనే 'మనకీ క్రింది వాక్యములుగల స్వాతంత్ర్య పత్రమును బ్రకటించి యెల్ల రయుల్లముల నాచంద్ర తారార్కముగ నాక ర్షించి వైచెను.

“క్రైస్తవ మతము యొక్క సత్యమును మేము దృఢముగా నమ్మిన వారమయి మతమునలనఁ గలిగెడు చిత్తశాంతిని మేము కృతజ్ఞతతో నొప్పుకొనుచున్న వారమయ్యును, మావిశ్వాస ములను మాప్రజలలో "నెవరి మీఁదను నిర్బంధించు కోరిక గాని స్వాతంత్ర్యముగాని మాకు లేదని చెప్పుచున్నాము. తమతమ మత విశ్వాసములను బట్టిగాని యాచారములనుబట్టిగాని యెవ్వరు నే విధముగాను మావలన నిగ్రహమును గాని యనుగ్రహ మునుగాని పొందక యందఱును సమానముగా ధర్మశాసన ములవలని సంరకుణమును నిష్పక్ష పాతముగాఁ బొందవలయుట మాయభిమతమును మాకు సంతోష కరమును నని మేము ఘో షించుచున్నాము. మా ప్రజలలో నెవ్వరియొక్క మతవిశ్వాస ములతోను పూజా విధానములతోను తామేవిధమయిన సంబంధమును మాక్రింది యధికారు లెవ్వరును కలుగఁ జేసికో గూడదనియుఁ గలుగఁ జేసికొన్న యెడల మాయాగ్రహమున కట్టినారు పాత్రులగుదురనియు మేముదృఢముగా విధించు చున్నాము,