పుట:Delhi-Darbaru.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.}}


బ్రిటిషు దర్బారులు

ఔరంగ జేబునకుఁ దరువాత మన యైదవ జార్జి చక్ర వర్తికాలము వఱకును ఢిల్లీ నగరమునఁ బ్రసిద్ధ సార్వభౌము లెవ్వరును బట్టాభి షేక మహోత్సనము నంద లేదు. కాని విక్టో రియా మహా రాజిగారి ప్రతినిధిగ లిట్టను ప్రభువును, స ష్టమైడ్వర్డు చక్రవర్తి ప్రతినిధిగ లార్డుకర్జనును, నచ్చట దర్బారుల నడపి యున్నారు. వారివలన నే ఈ దర్బారు' పదమున కింత ప్రాముఖ్యత కలిగినది.

1877న సంవత్సరపు దర్బారు.

1858 వ సంవత్సరమున భరతవర్షపుఁ బ్రభుత్వము ఆంగ్లేయవర్తక సంఘమువారినుండి విక్టోరియా మహారాణి గారికి మారునఁ బడియెను. అట్టిమార్పువలన మన దేశమునకు నొక్క- విశేషగౌస్నము గలిగెను. ఏదోయొక వర్తక సంఘము గా పరిపాలనకును నుత్తమ జన్మమ ది యల రారు మహా రాణి పాలనకును నెంత తారతమ్యము గలదియు వర్ణించుటయే యన.