పుట:Delhi-Darbaru.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

దర్బారుల చరిత్రము.


ఆనాఁడే ఔరంగ జేబు పేరునఁ క్రొత్త నాణ్యములు ముద్రింపఁబడెను. సామ్రాజ్యము నందలి వివిధ రాష్ట్రములకును ఈసింహాస నారోహణ వార్తందెలుపుచు నుత్తరములు పంపఁ బడెను.

ఇట్లు ముఖ్య సభాభననమున నుత్సనము ముగిసిన పిదప నౌరంగ జేబు అంతఃపురమున నెకదర్బారును మఱియొక ఆంత రంగిక దర్బారును నడి పెను. మొదటి దానికి స్త్రీలును, రెండన దానికి నాహూయమానులయి యుండిన యొక కొందుఱును, మాత్రమే రానియ్యబడిరి. అవ్వానియందు చక్రవర్తి తన కుచితముని తోఁచిన విధమునఁ దనవారలకు బహుమానము లిచ్చెను.

ఔరంగ జేబు సింహాసనారోహణ సమయమున అక్బ రుచే నుపక్రమింపఁ బడియుండిన1[1] నౌరోజుశకమును రద్దుపఱచి మరల హిజిరాశకమును బ్రారంభింప నియమిం చెను. త్రాగు బోతుతనము మున్నగు దురాచారములను మాన్పుటకు నధి కారుల నేర్పఱచెను. చిల్లరపన్ను లనేకములను దుడిచివై'చెను. ధాన్యము పై బాటలలో వేయఁబడు చుడిన సుంకములను పోలీసునకని ససూలు చేయఁ బడుచుండిన పన్ను లను తొలఁ గించెను. ఇవియే ఆతఁడిచ్చిన వరములు.

...............................................................................................

  1. 1. ఇది పారశీకుల సంవత్సరాది. వారికిని ఈ దేశపు మహమ్మదీయు లకును భేదములుగలవు. కావున మార్పు.