పుట:Delhi-Darbaru.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఔరంగ జేబు పట్టాభి షేకము.

369


యుండెను. పట్టాభి షేక భవనమునందలి బయలు ప్రదేశ మంత యును మఖుమలు గుడారములచే నావరింపఁబడి యుండెనని చెప్పవచ్చును. ఆగుడారములలో చిత్రమగు రత్న కంబళములు పరువఁ బడియుండెను. ఇప్పగిది ఎబ్భాగమునకుఁ దిరిగినను నవరత్నముల ప్రభలును వెండి బంగారముల కాంతులును మఖు మలు పెట్టుల శోభలును చూపరుల కానందము గొలుపుచుండెను.

శుభముహూర్త మాగతమైనదని జ్యోతిష్కులు తెలు పుట తోడనే తెరమరగున సంపూర్ణ సన్నాహములతో గూర్చొనియుండిన ఔరంగ జేబుచక్రవర్తి లేచివచ్చి సింహాసనము నధిష్టించెను. మంగళ శబ్దములును ఘనతూర్య రావములును చెలంగె. అంతట మెక గాయకుడు ముందుకువచ్చి యున్నత పీఠంబు పై నిలుచుండి చక్రవర్తిగారి నామధేయమును బిరుదు లును మున్నగువానితోఁ జేరిన 'ఖుత్బా' యను. ప్రకటనను గంభీర స్వసమునఁ జది వెను. సామంతు లెల్లరును చక్రవర్తికి నతు లొనర్చిరి. రాజ సేవకులు పన్నీరును బుడ్లుబుడ్లుగ సభాసదు లెల్లర మీదను కురిపించిరి. తాంబూలము తట్టలతోఁ బంచి పెట్ట బడియె. అత్తరు, పునుఁగు,జవ్వాది, అగరు, కస్తూరీ, మొదలగు సుగంధ ద్రవ్యముల పరిమళము , సభాభవనమున గుప్పుగుప్పుమని ప్రసరింపు చుండెను.