పుట:Delhi-Darbaru.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

దర్బారుల చరిత్రము.


ణ "నాఁటి యుత్సవమున కేర్పడిన పట్టాభి షేక భవనముం జొచ్చెను. దాని పేరు 'దివాని ఆమ్.' అద్దాని లోకప్పును నలువది స్తంభము లును వెండిబంగారు జరీపని చేనొప్పు పారశీక దేశపు మఖలు గుడ్డ చేతను పేరుగాంచిన గుజరాతు దేశపు సరిగెబుటా వేసిన పట్టు చేతను, గప్పఁబడియుండెను. ప్రతి కమాను నుండియు క్రిందికి దిగజారు బంగారు గొలుసులకు రత్న ఖచిత సువర్ల గోళములు వేలుచుండెను. భవనమధ్యమునఁ గొంతభాగము చదరముగ పైడికమ్ముల కటాంజనము చే వేరు చేయఁ బడియుండెను. దాని 'నడుమ తన్న లంక రించు వజ్రములును కెంపులును పద్మరాగము లును మహా ప్రకాశ పరంపరలనీ నలోకమునందలి విచిత్రములలో నొక్కటని ప్రసిద్ధిగాంచిన మయూరాసనము సంస్థితమై యుండె. అద్దాని పురోభాగంబున సుందర తమమగు వితానంబొండు నాల్గు రత్నమయ దండముల ప్రాపున నెలకొల్పఁ బడియుండె. అందు ముక్తాహారము లె పగ్గములయి యుపకరించుచుండె. మయూరా సనమును జుట్టివచ్చ కటాంజనమునకు ముందటి రెండువైపులను వ్రేలు ముత్యపు గుచ్ఛములతో నలంక రిషఁబడిన భూరిచ్ఛత్ర ముల జతయుండెను. సార్వభౌముని సింహాసనమున కిరు ప్రక్క- లను శృంగార మైన భర్మ్యమంచకము లిడఁబడియుండెను. వీని యన్నిటికిని నెనుక స్వర్ణమయ పీఠములషయి నవరత్న ఖచిత ఖడ్గములును, శుద్ధకాంతుల ప్రసరింపఁ జేయు డాలులును, ఈటె లును, మున్నగు చక్రవర్తిగారి యాయుధములు ప్రదర్శింపఁబడి