పుట:Delhi-Darbaru.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మ రాజు రాజసూయము.

363


రాజుచే నింద్రప్రస్థ పురమున జరుపఁబడినది మనంర్ఱింగిన వానిలో ముఖ్యముగ నెన్నఁబడవలసియున్నది. 1 [1]దానితో దులఁదూగు నది మరల నాతఁడే హస్తినాపురమున నొనర్చిన అశ్వమేధ యాగము.

ధృతరాష్ట్రుఁ డనుమతింప ధర్మ రాజు ఇంద్రప్రస్థపురము రాజధానిగ రాజ్యమేల మొదలిడి మయునిచే సభాభవనమును గట్టించెను. అచ్చట ధర్మ రాజు మొదటిద ర్బారును రాజసూయ గమును జరిపెను.

దర్బారు జరిగినది సభాభవనప్రవేశ దివసముననని తెలియ వచ్చుచున్నది. నాఁడు భూరిభూసుర సమాజమును ధర్మసుతుఁడు భక్తికోడఁ బూజించి ధనార్థులఁదన్ని యశంబుగాంచిన వెనుక

మ. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్యసం
పదలో లింగొనివచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించిర
య్యుదయాస్తాచల సేతు శీతనగ మధ్యోద్వీపతుల్ సంతతా,
భ్యుదయు ధర్మజుఁదత్సభా స్థితుజగత్పూన్ల ప్రతాపోదయున్. "

ఆతరుణమున మహామునుల నేకులు సభారంగము నలు కరించియుండిరి. అందు నారదుండును నుండెను. అతఁడు ప్రోత్సాహింప " నారాయణ దేవుచేత ననుజ్ఞాతుండయి తమ్ము లయు ధౌమ్యు ద్వైపాయనాదులయు ననుమతంబున ధర్మ రాజు

.............................................................................................

  1. ఈయాగముల వర్ణన మహాభాంతమున సభాపర్వమునందును శాంతి ప్వమునందును గననగును.