పుట:Delhi-Darbaru.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణ రాజ ఒడయరు.

357


విషయములను బాలుర విషయములను ఇంకను ఇతర సాంఘి క విషయములను గూర్చిమిక్కిలి యుపయోగకరమగు కొన్ని శాసనముల నిర్మించి యున్నారు. 1906-1907లో ఇదేమాధవ రావుగారి కాలమున గ్రామిక విద్యాలయములలో బాలురకు బడి జీతములు పుచ్చుకొనక చదువు నేర్చుకొను నట్లు త్తరువయ్యెను. కావున నేఁడు మైసూరులో బాలురకు స్వదేశ భాష యందు ఉచి తముగ విద్యా దానము చేయఁబడుచున్నది. ఇటీవల మహా రాజు గారు తమ దేశముదలి చేతిపనులు మున్నగువానిని వృద్ధిపఱచు నుద్దేశముతోఁ బ్రజల సాయము లేక ఆపని సాగదనుటను జక్కం గ గురైరింగిన వారుగాన ప్రజలసంఘము నొక దానిని ఆర్థిక సభ యను పేర దమయాజమాన్యము క్రింద నెలకొల్పియున్నారు. దాని పరిశ్రమవలన మైనూరు భరతవర్షమున నున్న ఆ స్థానము నందగలదని కొందఱ కైనను దోఁచకతప్పదు. ఇట్టియూహ కెడమిచ్చు చిహ్నముల నేకములు ఇప్పుడే గానవచ్చుచున్నవి. స్త్రీ విద్యకై మైసూరు మహారాణిగారి కలాభవనము గాంచిన ప్రఖ్యాతి హిందూస్థానమునందలి మఱి యే స్త్రీవిద్యాలయమును గాంచియుండ లేదు. కొంత కాలము క్రిందట బెంగుళూరునందు జె. ఎన్. తాతాగారి యౌదార్యమువలన ప్రారంభింపఁబడిన అన్వేషణ విద్యాగారము (Research Institute) ఆసీమకంతటి కిని వన్నెఁ బెట్ట వేచియున్నది. దినదినమునకు సంఖ్యయందుఁబె పొందుచుండు యంత్రశాలలు ఆసీమ వెలుపటి ప్రాంతమునగల