పుట:Delhi-Darbaru.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమీషనుపరిపాలన.

349


మున జరుగుచుండిన దురాచారములను దొలఁగించెను. ఈరీతి. నీతని కాలమున మైసూరు జనులు శాంతి నందఁగలిగిరి. ఇతఁడు అనేకములగు చిల్లర పన్నులను త్రోసి వేసి 'నేలపన్ను నుగూడ తగ్గించినను వసూలు పద్ధతులలో చేసిన మార్పుల వలన మొదటి కంటే పన్నెక్కుడుకాఁగడంగెను. 1861వ సంవత్సరమున నితనికి వ్యాధి తటస్థించినందున పనికి రాజీనామానిచ్చి ఇంగ్లాండునకుఁ బయనమై పోవుచు సూయెజు వద్ద మృతి నందెను.

1862 వ సంవత్సరమున మైసూరు సంపూర్ణముగ నాంగే య పద్ధతుల ననుసరించి యే ఏలఁబడఁజొచ్చెను. సీమయంతయు మూఁడు డివిజనులుగను ఎనిమిది జిల్లాలుగను విభజింపఁబడెను.. డివిజనుల పై సూపరింటులును జిల్లాలపయి అసిస్టంటు సూపరింటు లును నేమింపఁబడిరి. ఆర్థికాంగము (Financial dept.) గొప్పసం స్కారములందెను. ఆదాయవ్యయగణన పత్రములును (బడ్జెట్టు లును) లెక్క తనికీలును (ఆడిట్టులును) ఉపయోగమునకుఁ గొని తేఁ బడెను. 1863 వ సంవత్సరమున సర్వే సెటలు మెంటులు ప్రారంభ మయ్యెను. నేలపన్ను 30 సంవత్సరములకొక పర్యాయము పరీ క్షింపబడు పద్ధతి యుపక్రమింపఁబడెను. ఇనాం కమిష నొకటి ఏర్పడెను. నీటి కాలువలును అడవులునుదగురీతిని అభివృద్ధి నందెను. న్యాయ తీర్మానాది కార్యములు పెరుగుచు వచ్చినందున జిల్లాలలో న్యాయాధి కారులు. నియమింపఁ బడిరి. విద్యాలయ ములు నెలకొల్పఁబడెను. (మ్యునిసిపాలిటీలు) గ్రామరక్షక .