పుట:Delhi-Darbaru.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైసూరు రాజవంశము.

319


క్కనిమూలమున నేర్పడినది. కావున నిటమైసూరు రాజవంశ చరిత్ర నిక ప్రారంభింతము.

మైసూరు రాజనంశము.

వాడుకననుసరించి మైసూరు రాజవంశమునకు మూల పురుషులు విజయ కృష్ణులను ఇద్దఱు సోదరులు. యదుసంతతి వారగు వీరు ద్వారకనుండి బయలు దేరి దక్షిణమున నెచ్చట నైన రాజ్య మేర్పఱచు కొనవ లెనను ఇచ్ఛగలవారయి ప్రయా ణము చేయుచుండిరి. ప్రస్తుతము మైసూరు నగరముండు ప్రదే శమున కనతి దూరమున హదినాడు అను గ్రామముం డెడిది. వీరిరువురును అచ్చటికి వచ్చునప్పటికా గ్రామపు ప్రభువునకు మెదడు చెడినుదున నతఁడు దేశమువదలి పోయియుండెను అతనికొ కే కుమార్తె గలదు. ఆమెను వివాహమాడ వలెనను దురాశ ప్రక్క గ్రామమగు కారుగహళ్లి ప్రభువునకుఁ బుట్టి యుండెను. అతఁడు హీనజనుఁ డయినందున హదినాడు వారు దమబిడ్డ నతని కియ్యనిష్టము లేని వారయి యుండిరి. అందువలన నతఁడు సమయము వేచియుండెను. హదినాడు ప్రభువు మనోచాంచల్యమున నెట నేనియు నేగుట తోడనె ఆవంశ మువారికి దిక్కు లేనందున కారుగహళ్లి ప్రభువు వారిబిడ్డను బలాత్కారమున సంపాదింప జంకిం చెను. కావున వారు దమ కన్యనతని కియ్యనియ్య కొనిరి.