పుట:Delhi-Darbaru.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఢిల్లీ న గ ర చ ి త్రము.


యీలను రెండుమారు లెదిర్చి యోడించి తన విడిదిని బల పఱుచుకొనుటకుఁ గోటను గట్టుకొనెను. (క్రీ. శ. 1299). ఇదియె నూతన ఢిల్లీ. దీనిని బురాతన డిల్లీతో , జహన పానా అను పేట గలిపి వేయుచున్నది.

తు ఘ్ ల ఖ్ వం శ ము.

ఖిల్జీవంశ మంతరించి గ్యాసుద్దీన్ తుఘ్ లక్ రాజ్యా రూఢుఁడయిన తోడనే నతఁడు (క్రీ. శ. 1321) కి నాలుగు మైళ్ల దూరమున తుఘ్ లఖా బాదును నిర్మించెను. కాని యిప్పు డది నిర్జనముగా నున్నది. క్రీ. శ. 1825 -- మహమ్ముదు తుఘ్ లఖ్ సింహాసనమునకు వచ్చెను. అతని రాజ్య కాలములో బటూ టాయను ప్రవాసికుఁ డొక్కఁడు ఢిల్లీని దర్శిం ప వచ్చెను. అత డప్పటి ఢిల్లీ నిగూర్చి యిట్లు వ్రాయుచున్నాడు:-- " అది గొంచె మించుమించుగ 'నెడారివ లె నుండెను. అందుఁ గట్టడములు చాలతక్కున. గృహస్థు లిండ్లు వదలిపోయి యుండినందున నది పూర్తిగఁ బాడుపడియుండెను. అందు వలన లోకమునందలి యత్యుత్తమ నగరమున సత్యల్పసఃఖ్యగల గృహస్థులుండుట తటస్థించెను.” ఇదతిశయోక్తి యేమియును, లేదు. " " పేరువహించిన ఢిల్లీ నగరమును గుడ్లగూబలకు నివా సముగను, అటవి మృగముల కాస్థానముగను వదలిపోవు చున్నాను.” అని "ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఇట్లున్నను ఇది మిక్కిలి మహత్వముగల పురము. సౌందర్యమును బలమును