పుట:Delhi-Darbaru.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
9
ఖిల్జీవంశము


బూర్వమునందలి రాజులవలె దుర్మార్గుఁడును వృధావ్యయ పరుఁడునుగాక నిర్మలమగు నడవడిక గలవాఁడు. ఇతఁడొక విషయమున నెల్లరకును నా దర్శకుఁడనియే చెప్ప నొప్పును. ఢిల్లీ రాజ్య పరిపాలకుఁడుగ నుండియు నీతఁడు దన స్వార్ర్జితము వలన నే జీవయాత్రగడపెను. పారసీ భాషయందలి గ్రంథముల ప్రతులు వ్రాసి యితఁడు దన కర్చులకు సంపాదించుకొను చుండెను. ఇతని ప్రోత్సాహముననే పారశీక భారత వర్షముల' చరిత్రియగు ' తాబకాతి నాసరి' యనునది రచింపఁబడెను. ఇతనికి దరువాత నీతని బానిసయు దండనాయకుఁడును నగు గ్యాసుద్దీన్" బల్బను రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలము సరికి మొగలా యీల దాడి యెక్కుడయినందునఁ బండ్రెండుగురు మహమ దీయ ప్రభువు తనికడం జేఱియుండి. ఢిల్లీ యందలి నీధుల కీతఁడు వీరి పేరులఁ బెట్టను. క్రీ. శ. 1288 లో నీ బానిసనంశ పురాజును జంపించి జలాలుద్దీన్ ఖల్టీ సీహాసనము నాక్రమించుకొనెను.

ఖిల్జీవంశము.

జలాలుద్దీ: ఖల్జి బహుపరాక్రమశాలి. ఢిల్లీ ద్వారము వఱకును నాలుగుమారులు ప్రయాణమై వచ్చిన మొగలాయీలు నితఁడు తిగుగఁగొట్టి యంద నేకులను దనమతమునకుఁ జేర్చు. కొని తన కొలువునందే యుంచుకొనెను. వారికిఁ బ్రత్యేకించి యొక పుర భాగమును గట్టియిచ్చి దానికి “ మొగల్పుర 'మని పేరి డెను. ఇతనినిజంపిచి గద్దెక్కిన యల్లాయుద్దీను మొగలా