పుట:Delhi-Darbaru.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగు లు.

301


సం నిదర్శనము లున్నవి. 'మైసూరునకు వచ్చిన గంగులు పదునొకం డన శతాబ్దము ప్రారంభము వఱకును అట రాజ్య భారమును నిర్వ హించి రాజేంద్రచోళునిచే 1004 లో నోడింపఁబడిన తరువాత నారలలో నొక కొందరు మఱల కళింగము నంకకు నడచి గంజాము విశాఖపట్టణము జిల్లాలలో స్వతంత్ర రాజ్యముల పాదించుకొనిరి. మైసూరునకు నచ్చిన గంగులు “ దాడిగ మాధ వు'లను రాచకొమరులును వారి పరిజనము నని చెప్పవచ్చును. సింహనందియను జై నుని సాయమువలన వీరు క్రీ! శ|| రెండవ శతాబ్దమునకు వలాల (కోలారు)ను నందగిరి (నందిదుర్గమును) సాధించి మైసూరునందు రాజ్యమును స్థాపించుకొని ఆ రాజ్య మునకు గంగవాడి యని పేరు గలిగెను. ఈగంగులు మొదటి నుండియు జైనులగుటనలన దక్ష్మిణ హిందూస్థానములోఁ "బేరుఁ గనిన జై నవంశములలో వీరిదే ప్రఖ్యాతము. ఈ వంశములోని రాజు లెల్ల రకును “కొంగుని వర్మ' యనునది బిరుదునామము. వీరిలో మూఁడవవాఁడు రాజధానిని కావేరీ తీరముననుండు తల కారునకు. మార్చెను. ఏడవ వాఁడగు దుర్వినీతుఁడు పల్ల వుల నోడించి వారి భూములఁ గొన్నిటి నాక్రమించినదే గాక పూర్వదక్షిణ భాగములఁ దన రాజ్యమును వ్యాపింపఁ జేసెను. ఎనిమిదవ శతాబ్ద మధ్యమునకు గంగుల రాజ్యము మహా నైభవమంది శ్రీరాజ్యమని పిలువబడుచుండెను. శ్రీపురుషుఁడను వాడఁప్పుడు రాజు.అతఁడు రాజధానిని