పుట:Delhi-Darbaru.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ 'హా బలు లు

297.

.

నొక్కఁడగు' కృష్ణవర్మ జయించినట్లు అతనివంశజుడగు దేవవరుని శాసనమువలనఁ దేలుచున్నది. . ఈతనికి తరువాత నాగులు కదంబులకు సామంతులయి ప్రనర్తించిరి. కదంబవంశపు స్థానమును చాళుక్యు లాక్రమించుకొనుట తో నాగులువారికి సామంతులయిరి (కీ | శ || 556). విజయనగర సామ్రాజ్యము ప్రారంభమగు వఱకును కదంబులు సంపూర్ణముగ నశింప లేదు. చాళుక్యులకు సామంతులును ప్రతినిధులును నై అప్పుడప్పుడు మఱలమఱల ప్రాముఖ్యత గాంచుచుండిరి. ఈ వంశపు శాఖ లలో నొక్కటి. 'గోవా' ను రాజధాని చేసికొనిరాజ్య మేలు చుండెను. కాని విజయనగర : విజృంభణముతో నెల్లరును పేరైన లేక నశించిపోయిరి.

మహాబలులు.

రమారమి కదంబులు మైసూరునందు వాయవ్య మూలనఁ గానవచ్చు కాలముననె మహాబలులు తూర్పు దిశయందు గాన నగు చున్నారు. వీ రాంధ్ర దేశమునకు పశ్చిమ దిగ్భాగ మున -12,000 గ్రామముల పై యధి కారము వహించి ఏడునర లక్షల భూమిని ఏలిరని వీరి శాసనములవలనఁ దెలియవచ్చు. చున్నది. వీరి ముఖ్యమండలము ముళ బాగులు. వీరు బలి1[1] చక్ర వర్తి బాణాసురుల సంతతి వారని చెప్పుకొను చున్నారు.

1

  1. ఇతని రాజధాని మహాబలిపురము.మహాబలుల కీదియ మొదటి రాజధానియే మొ?