పుట:Delhi-Darbaru.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

మైసూరు రాజ్యము,


ఈవృక్షమును దమకు కులనామముగఁ జేకొనికి గాఁబోలు.. నీరు బ్రాహణులు.

కదంబులలో మొదటివాఁడగు నీ పైఁ జెప్పిన బాలుని పేరు జయంతుఁడనియును త్రిలోచన , కదంబుఁ డనియును, త్రినేత్ర కదంబుఁడనియును గానవచ్చుచున్నది. ఇతని వంశపురాజులు క్రీ. శ. రెండవ శతాబ్దము మొదలు ఆఱన శతాబ్దము వఱకును స్వతంత్రులయి రాజ్య మేలినట్లును అనే కాశ్వమేధము లొనర్చి నట్లును గానవచ్చుచున్నది. వీరికిని నాగులకును బద్ధ నైరముండె డిది. పల్లవులును వీరికి శత్రువు లే. కావున కదదలంబులకును నాగులకును యుద్ధములు హెురాహోరిగ జరుగుచుండెను. కదంబులు పల్లవులచే నోడింపఁబడి తమబలమును గోలుపోయి యుండిరి. కాని మయూరశర్మయను కదంబుఁడు మఱలకదంబ వంశమునకు సంపూర్ణ స్వాతంత్ర్యమును సంపాదించి తనశక్తి సామర్థ్యముల వలన మహా ప్రసిద్ధి వడ సెను. పోయియుండిన వైభవమును మరల్చినవాఁ డగుటవలన వాడుకలోనుండు కొన్ని కథల ననుసరించి ఇతఁడే కదంబవంశ స్థాపకుఁడుగ వర్ణింప బడు చున్నాఁడు. నాగుల ప్రతాపమును వర్ణించుటకుఁ గాని వారి చరిత్రను వ్రాయుటకుఁగాని యిది యదను కాదు. వారి పేరుఁ జెప్పిన కాశ్మీరముగూడ యదరుచుండె ననిన * [1]వారెంతటి శత్రువు లనునదియు 'విశదము కాఁగలదు. వారినికదంబులలో ...........................................................................

  • రాజతరంగణిం జూచునది