పుట:Delhi-Darbaru.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాతవాహనులు. లేక. శాలివాహనులు. *.

293


ఈవిధమున మౌర్యుల సామ్రాజ్యమున నుత్తర మైసూరు భూములు నుండెనని విస్పష్టముగ , నేర్పడుచున్నది. పురాణ గాథల ననుసరించి మౌర్యవంశజులు 137 సంవత్సరములు రాజ్య మేలినట్లు తేలుచున్నది. ఆ శాఖలో గడపటివాఁడగు బృహద్ర ధుని అతని సేనానియగు పుష్యమిత్రుడు. చంపించి సంగవంశ మును స్థాపించెను. వీరు 112 సంవత్సరములు రాజ్య మేలిరి: కాని ఆకాలములో కడపటి భాగమున కణ్వవంశమువారు వీరిని మించిన ప్రఖ్యాతి గలవారయి 45 ఏండ్లు సర్వ స్వతంత్రు లయి పరగిరి. వీరు సంగ భృత్యులని కూడ పిలువంబడి యుడు టచే వీరు మొదట మొదట సంగా, రాజులకు లోబడినవారయి యుండినను నుండవచ్చును. సుకరుడను కడపటి కణ్వరాజు ఆంధ్రభృత్య వంశమునకు స్థాపకుఁడగు సీముకుని (శ్రీము ఖుని) చేనోడింపఁబడెను. ఈ యాంధ్ర భృత్య వంశమున కే శాతవాహనులనియు తచ్ఛబ్ద ప్రాకృతమగు [1]శాలివాహను లని యు పేళ్లు. ఈ శాలివాహనులకు ముఖ్య రాజథాని కృష్ణాతీర మున నుండు ధారణికోట. వీరికి మరియొక రాజధాని కూడనుండె డిది. అది గోదావరీతీరమున (నిప్పటి నైజాము రాజ్యములోని) పైఠణ్ పురము. దీని కే ప్రతి స్థానమని పేరు. ఈ శతవాహను లు త్తర 'మైసూరు సీమను ఏలిరనుట శాసనములవలనను నాణ్య ముల వలనను నిశ్చయింపఁబడి యున్నది. ఇచ్చట రాజ్య ....................................................................................

  • ఈ పేరును బట్టియే శాలివాహన శక మేర్పడినది.