పుట:Delhi-Darbaru.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము.

మైసూరురాజ్యము.

ప్రవేశిక

భరతవర్షమునందు స్వదేశ రాజ్యములలో మూఁడవది యయి విరాజిల్లునది మైసూరు. తూర్పుకనుమలును పడమటి కనుమలును నొక్కటిగఁ జేరు నీలగిరు లిద్దానికి శిరమని చెప్పు వచ్చును. అచ్చటినుండి ఈ దేశము వెడల్పగుచు నుత్తరమునకు వ్యాపించుచున్నది. ఈశాన్య దిగ్భాగమున బొంబాయి రాజ ధానిలోని రెండు జిల్లాలును నైఋతి మూలన కొడగును దప్ప దీని కన్ని వైపులను మద్రాసు రాజధానియెయెల్ల. ఇందు ఉన్న తము లగు పర్వతములును పురాతనములగు నడవులును 4,000-5,000 అడుగుల ఎత్తునకు దల లె త్తికొని గంభీరముగ నిలచియుండు. అసంఖ్యాకములగు దుర్గములునుగలవు. కావేరి, తుంగభద్ర, పాలేరు, ఉత్తర పినాకిని, దక్షిణపినాకిని, మున్నగుప్రసిద్ధ నదీ నదము లీ దేశమున ప్రవహించుచున్నవి.ఇందు సొంపులుగురిపించు జలపాతము లనేకములు. వానిలో 'గెర్సొప్పా జలపాతము సుప్ర