పుట:Delhi-Darbaru.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

బరోడా రాష్ట్రము.


కయి మొఱ్ఱ పెట్టుచుంవో ఆ రాజకీయ సంస్కారము - అధి కార న్యాయ శాఖల . : విభజనము - నీతఁడు దన రాష్ట్రమున నొనర్చి నిర్భంధ విద్య, అతి బాల్యవివాహశాసనము మున్నగు, విషయములుదు వలెనె: తక్కుంగల భారతీయ ప్రభుత్వములకు మార్గదర్శకుఁడయి యున్నాఁడు. గ్రామ పంచాయతుల నభి వృద్ధి చేసి తాలూ కా బోర్డులకును జిల్లా బోర్డులకు నవి. నిశ్చయ సంబంధము గలవగునట్లు చేయు. తలుపుతో.. నతఁడు నిర్వచనా పద్ధతులను తన దేశమున నుపక్రమించి యున్నాడు. .

ఈ సంస్కారము లన్నియును మహారాజు, గాయిక వాడు "సయాజి రావు దీర్చుటలోఁ దనకు, సహాయులుగ నాతఁడు: నియ మించుకొనిన మంత్రులును , మన దేశ చరిత్రము నందు మహ నియులే. అందు' సర్. టి. మాధన రావునకుఁ దరువాత ముఖ్యుఁడు కీర్తి శేషుఁడగు 'రమేశచంద్రదత్తు. ఇతనినిగుఱించి విశేషించి యట వ్రాయుటకు నవ కాశము లేదు. కాని యీతఁడు పరిపాలకులలోఁ బరిపాలకుఁడనియు గ్రంథకర్తలలో గ్రంథకర్త యనియు స్వదేశాభిమానులలో, స్వదేశాభి, మానియనియుఁ , బేరువడసియున్నా డనిన నీతని విస్తారశ క్తి.. వెలువడఁగలదు. ఇట్టి చరిత్రగల బరోడా సంస్థానమింకను వృద్ధినొంది సర్వకాలమును భరతవర్షము , నందలి యితరస్వ దేశ రాష్ట్ర ములకు మార్శదర్శకమగుచు వెలుంగుగాత!