పుట:Delhi-Darbaru.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు II

275


నై దేండ్ల వర్తమానమను (Quinquennial Reviery of the Progress cf Education) గ్రంథమునం దీబరోడా సంస్థానము నందలి విద్యాభివృద్ధిని గుఱించి యిట్లు వ్రాయుచున్నాఁడు:-- " అమేలియందు హీనజాతులకు విద్యగఱవుటకయి నెలకొల్పఁబడిన విశేషస్థాపనలును, నిర్బంధ విద్యా పద్ధతియును నిప్పుడనుభవము నలన ఫలప్రదము లయినవి.

ఇచ్చట హిందూస్థానమునందు మఱెచ్చటను గానరాని స్త్రీ విద్యాభి వృద్ధియుండుటయు నొక వి శేషాంశమే. ఇదే సందర్భమున భరతవర్ష మునందు మొత్తముమీఁద నూరు గ్రామములకు 28.47లో విద్యాలయములుండ బరోడాయందు మాత్రము నూటికి 48.41 గ్రామములలో పాఠశాలలుండెనని యును. విద్యాభ్యాసమునకు ఉచిత వయస్కులగు బిడ్డలలో మన దేశమంతటికిని విచారించినచో నూటికి 12.5 నుండ బరోడా యందు మాత్రము 25.5 గనుండెననియు, అందును బాలికలలో దేశమంతటికిని నూటికి 2. 10 గ నుండఁగ బరో డాలో 8.6 గ నుండెననియుఁ దెలియవచ్చుచున్నది.

ఇట్లు ప్రథమపాఠశాలల యెడ గృషి చేయుటతోడ నే తృప్తినొందక నీ మాన వేంద్రుఁడు దరిద్రులకును ఇదివఱకు విద్యాభిరుచి ఎక్కుడుగ లేని జాతుల వారికిని బ్రోత్సాహ మొసంగుటకయి. ఉన్న తవిధ్యను - నేర్పునట్టియు, పరిశ్రామిక విద్యను బోధించునట్టియు - ఉత్తమ విద్యాలయము లేర్పఱచి