పుట:Delhi-Darbaru.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

బ.రో డా రాష్ట్ర ము.


వ్యాపింపఁ జేయుచు గాయిక వాడొక చట్టమును నిర్మించెను. దానినలన బాలురు 6. మొదలు 14 ఏండ్ల ప్రాయము నచ్చు వఱకును బాలికలు 6 మొదలు 12 ఏండ్ల ప్రాయమువచ్చు వఱకును విద్యాలయముల కనుపఁబడవలసి నట్లేర్పడెను. కొన్ని సందర్భములయందు మాత్ర మీచట్టమును గఠినముగ నుప ' యోగింప కుండునట్లు నిర్ణయింపఁ 'బడినది. ఇట్టి సందర్భము లేవియు లేనిచోట బాలుఁడుగాని బాలికగాని పాఠ శాలల కనుపఁ బడనిచో వారి తలిదండ్రులు వారిని పంపువఱకును మాస మున కొక రూపాయి యపరాధము నిచ్చుకొనుచుండవలెను. ఈవిధముగ నుపక్రమింపఁబడిన నిర్బంధోచిత విద్యా పద్ధతిని గుఱించి సయాజిరావు గాయికవాడే నుడివినట్లు రాఁగలవని జంకించిన కష్టములును నష్టములును . రాఁజాలవని అనుభవ ముచే స్థిరపడినది.”

మనగాయిక వాడు మహా రాజు మహమ్మదీయులకును హీన జనులకును విద్యాభ్యాసానుకూలము లేర్పఱచుటయందువి శేష మగుఁ బరిశ్రమచేసి యున్నాఁడు. ఇప్పుడు విద్యాభ్యాసమునకు యుక్తమగు వయస్సుగల నుహమ్మదీయ బాలురలో. నూటికే బదిగురు విద్య నభ్యసించుచున్నారనిన గాయిక వాడు. పట్టుదల విశదముగాఁ గలదు. 1888వ సంవత్సరము మొదలు అంత్యజు లకయి విశేష, విద్యాలయము లభివృద్ధిఁ జెందుచు వచ్చుచున్నవి. జె. ఎన్. కాటనుగారు వ్రాసిన విద్యావిషయకమయిన పదు .