పుట:Delhi-Darbaru.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

బరోడా రాష్ట్రము.


యెడ దాతృభావనా ప్రదర్శనముగాదు” అనియు నుడివి యున్నాఁడు,

ఈ పై వాక్యములకు వ్యాఖ్యానము వ్రాయఁ గడఁ గినచో గ్రంథము నెంత యైనను పెంచవచ్చును. కాని ప్రస్తుత మది కార్యముగాదు. సయాజీరావు ఉపక్రమించి జయప్రదముగ నడుపు చుండు సంస్కారములను వర్ణించినచో నాతఁ డెట్లు తన వాక్యములను సార్ధక పఱచినదియుఁ జదువరులకు విశదముగాఁ గలదు.

బరోడా రాజ్యమున నిప్పటిగాయిక వాడు కాలమున జరిగిన సంస్కార ఫలములు ముఖ్యముగ ప్రజల విద్యను గుఱించి నవియే యయియున్నవి. ఈసంస్థానమున 1880-81 న సంవత్సరములలో 180 స్వదేశ భాషా విద్యాలయములుం డెడివి. అందు 17,465 గురు విద్యార్థు లభ్యసించుచుం డెడివారు. 1904 - 05 లో విద్యాలయములసంఖ్య 1248 అయి యుండెను. అందలి విద్యా ర్థులు 81, 649. ఈయభివృద్ధికి "కారణ మేమి? 1885 వ సంవత్స రమున నొక క్రొత్తయు త్తరువు బయలు దేరెను. దానివలన సంవత్సరమునకు 30 క్రొత్తవిద్యాలయములు గట్టి పవలసిన దనియును విద్యా శాఖవారు (1) క్రొత్త వాచక గ్రంథముల సిద్ధ పజచుటయందును (2) బాలురకు వ్యాయామవిద్యల .నేర్పుట యందును (3) బాలికా పాఠశాలలకు నుపాధ్యాయినులుగ నుండ, స్త్రీలను శిక్షించుట యందును (4) మధ్యజాతుల వారికిని హీన