పుట:Delhi-Darbaru.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ ల్హా రి రావు.

263.


పనికిమాలిన మంత్రులను చేర్చుకొని అవాచ్యమగు నపరాధ ముల "నొనర్చుచు దుర్వ్యయము చేయ " నారంభించెను. ప్రజలు పన్నుల బరువునకుఁ దాళుట యసాధ్యమయ్యెను. రాజు కంటఁబడి స్త్రీలుమానమును దక్కించుకొనుట కష్ట మయి పోయెను. క్రౌర్యము - దలయె త్తికొని సంస్థానమున సంచరింప మొదలిడెను. ఇట్లుండ 1860 వ' సంవత్సరమున బరోడా సంస్థానము పై నధి కారము మఱల సంపాదించుకొని యుండిన బంబాయి ప్రభుత్వము వారు కర్న లు ఫేరెను రెసి డెంటుగాఁ బంపిరి. అతఁడు మల్హరిరావు లోపములను ' బూస గ్రుచ్చి న ట్లె త్తి చూప మొదలిడెను. వానిని విచారించుకొఱకు యాజమాన్య ప్రభుత్వము వారు 1878లో ఒక కమిషను నేర్ప కమీషను వారి యభిప్రాయము . ననుసరించి కూడ మల్హార రావు ప్రభుత్వము మిక్కిలి నింద్యముగాఁ దోఁచెను. కావున నతఁడు దన రాజ్యములోని దోషములను 1875 లోపుగ దిద్దుకొననలసిన - దని యుత్తరు . వాయెను. మలారి రావు మంత్రులు పనికిమాలిన వారని ఇదివఱకే - వ్రాయఁబడియెను గదా. వారిని దీసి వేయుట విషయములోను, గాయిక వాడు ప్రార్థన నంగీకరించి వచ్చియుండిన మన దాదాభాయి నౌరోజీ మొదలగు వారలకు. నిశ్చయమగు శ క్తులనిచ్చు విషయములో ను మల్హరిరావునకును ఫేరెకును భేదములు వచ్చినందున ఫేరె బరోడానుండి మారువఁ బడెను. కాని అతఁడు వెడలి