పుట:Delhi-Darbaru.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

బరోడా రాష్ట్రము.


సర్. ఆర్. 'షేక్ స్పియరు యొక్క దయ చేఁ దప్పించుకొనెను. 1868 వ సంవత్సరమున ఖండేరావును జంపించుటకే మల్లారి రావు మఱలనొక కుట్రజరిపెను. అదియును బయటపడెను. అప్పుడే ఇతఁడు పరలోకమున కనుపఁబడియుండును గాని అప్పటి రెసిడెంటు ఈతని పరమయి కరుణ చూపినందున నితఁడు పాడ్రాయందుఁ .. జెరసాలలో నుంచఁబడెను. ఖండే రావు వైకుంఠము/ కేగినపిదప నాతనిస్థానమునకు వచ్చుటకు నితరు లెవ్వరును లేమిం జేసి ఈతఁడా కారాగృహము నుండియె తీసికొని రాఁబడెను.

ఇన్ని కష్టముల పాలయ్యును నితనికి బుద్ధిమాత్రము కుదిరినది కాదు. గాయిక వాడుపదమునకు వచ్చిన తోడనే మునుపటి గుణమును మానక దుష్కార్యములకుఁ బ్రారం భించెను. ఖండేరావువలన నేమింపఁ బడియుండిన నౌకరు లెల్లరును ఆయాపదములనుండి తోలఁగింపఁ బడిరి. ఆతని భార్య. జమ్నా బాయి గర్భవతి ఇతనికి జడిసిరెసిడెంటు గారి సంరక్షణ మందొక కొంతకాలముండి ఆడబిడ్డనుగని రు 36,000 ల పెన్ షను' [1]తో. మఱలబరోడా చూచుట తటస్థింప దనుకొనుచు పునహా పోయిచేరెను. మల్టర రావు

.............................................................................................

1. .

  1. ఈవిషయమున మహా రాజు హోల్కారుయొక్కయు నప్పు డాతని మంత్రిగ నుండిన సర్ టి. మాధవ రావుయొక్కయు పరిశ్రమ - కొంతకలదు