పుట:Delhi-Darbaru.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

బరోడారాష్ట్ర ము



నన్న నో ఈతనికి ఈడగువాఁడు దొరకుట దుర్లభము. కావున నితనికి వేటయందును, ఆటలయందును వ్యాయామముల యం దును నభిరుచి మెండు.


సింహాసనమునకు వచ్చిన వెంటనే బరోడాను ఆంగ్లేయ పాలిత మండలముల కెనచేయఁదలఁచి ఈతఁడ నేక సంస్కా రములు ప్రారంభింప వలసినదని యుత్తరువు లొసంగెను. కొన్ని సంవత్సరములు మిక్కిలి పట్టుదలతోఁ బని గూడఁ జేసెను. కాని రానురాను మృగయా వినోదములయం దును, ఆభరణాడంబరముల యందును, వృధా వ్యయముల యందును మనస్సు దగుల్చుటం జేసియుఁ దానుపక్రమించిన సంస్కారముల యెడలఁ గ్రిందియధికారు లెట్లు ప్రవర్తించు చుండినదియు గమనింపక పోవుటవలనను ఈతఁడు మొదలిడిన పను లెవ్వియును దీరినవిగావు. క్రొత్తనీళ్ల తోబ్రాతనీళ్లును గొట్టుకొని పోయెనన్నట్లు అదివఱకుండిన ఏర్పాటులు గూడ నశించిపోయెను. అట్లగుట నీతఁడు మహెూత్సాహమునఁ దల పెట్టిన తలంపులు దేశమునకుఁ గొంతవఱకనర్థదాయక ములె యయ్యెను. కాని ఈతని కాలమునఁ గొన్ని సంవత్సర ములు ప్రత్తిపంట' మిక్కిలి చక్కగఫలించి జనులు సుఖపడినం దునఁ గాకతాళన్యాయమున నిప్పటికిని ఈతని పేరు ప్రజల త్యా దరమున నుడువు చున్నారు. ఇట్లనుటచే నితఁడు చేసిన దేమియు