పుట:Delhi-Darbaru.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఢిల్లీ నగర చరిత్రము.

వారికి దక్షుకులని పేరు. యుధిష్టరుఁ డార్యసిద్ధాంత సంరక్షకుఁడు. అగ్ని బ్రాహ్మణరూపమును ధరించి ఖాండనదహనము నపేక్షించుటవలనను, అనఁగా ఆర్యులగు బ్రాహణుల ప్రేరేపణవలనను, దిగ్విజయా పేక్షుం జేసియు, యుధిష్ఠి రానుజుండగు నర్జునుఁడు కృష్ణ సాహాయ్యమున మూలనివాసులను సాధించి యడవి ప్రదేశముగ నుండిన ఖాండవప్రస్థభాగమునంతయు నివాస యోగ్యముగ నొనర్చెను. తన్మధ్యమునఁ గట్టఁబడిన ధర్మరాజు ముఖ్యపట్టణమే ఇంద్రప్రస్థము, ఇంద్రుని సంరక్షణ దానికిఁ గలదను నమ్మకమువలనను సీనగరమాతని, యమరావతికి సౌందర్యమున నీడగుట వలనను దీనికి పేరు గలిగినట్టు తోచుచున్నది. పాండవుల కాలమున నీపట్టణ రాజము మిక్కిలి వృద్ధియయి 'పురోత్తమ' మనిపించుకొనియెను. ఇచ్చటనె ధర్మరాజునకు మూలనివాసులలో నుత్తమోత్తము డగు మయుఁ డను శిల్పకళాధురీణుఁడు సాటిలేని సభామంటపమును నిర్మించి యిచ్చెను. అందే ధర్మ రాజు రాజసూయయాగము చేసెను, ముందావిషయము వ్రాయఁబడును. భరత వంశలగు వీరులు రాజ్యము చేసినంత కాల మింద్రప్రస్థపురము దలయె త్తికొని యుండెను. కృష్ణుని ప్రపౌత్రుఁడగు వజ్రనాభుడు, దక్కి నయదు వంశమంతయు నశించిన తరువాత, నిటనే రాజ్యాభిషిక్తుండయ్యెను. శక వంశజులకిదియె రాజధానిగ నుండెను. క్రీ. శ. 395 సం|| మున విక్రమాదిత్యుఁడను బికుదువహించిన రెండవ