పుట:Delhi-Darbaru.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ నంద రా వు.

251


చేయుచుండిన గాయిక వాడు సైన్యము లిల్లు వచ్చి చేరెను. వాని వ్యయమువకు గాను ఆవిగ్రహకాలమున . 39 1/2 లక్షలు వెచ్చింపఁ బడియుండెను. గాయిక వాడు సాహాయ్యసైన్య ములు' గూడ సమర రంగమున నాంగ్లేయుల. శత్రువుల నెదుర్ప ననుపఁబడియుండెను. వాని కొఱకు రమారమి 48 లక్షలు న్యయమయియుండెను. ఈకర్చులన్ని టివలన నైన" కోటి నొక లక్ష, యప్పులలో గాయిక వాడు ఈఁదజలకుండెను [1]*అట్టి సమ యమున' సయజిరావు 1816వ సంనత్సరపు సంధిని దలంచుకొని అందొక నిబంధన మేరకు ఆంగ్లేయ ప్రభుత్వమువారు - దాము గాయిక వాడు సైన్యముల సాహాయ్యమున గెలిచిన భూభాగ మునం దాతనికిఁ గొంత భాగమిత్తుమని యొప్పుకొని యుండినం దున నద్దానిననుసరించి పీష్వానుండి వారు గొనిన దేశములో నొక ముక్క నిత్తురుగాకని . వేఁడెను. కాని వారు గాయిక వాడునకు నేమియు నిచ్చుట కిష్టము లేని వారయిరి. అందుచే సయాజికి ఆశాభంగమయి మిక్కిలి సంతాపము జనించెనను టకు సంధియము లేదు. 1819 వ సంవత్సరపు నక్టోబరు నెలలో ................................................................................................

  • ఈయప్పులకుఁ గారణము లివియని మౌంటు స్టూఆర్టు ఎల్ఫిక్ స్టను కొన్ని టిని వ్రాయుచున్నాడు. కాని మొత్తముమీఁద నీకోటి నొక లక్ష రూపాయలును సెనికులకు బాకీపడిన జీతముల రూపముననొ మాళవమున గాయిక వాడు (ఆంగ్లేయులకయి) నడపి నయుద్ధముల సమయమున దదర్దము సాహుకారులిచ్చిన యప్పురూపముననే ఉన్నదని ఎఫ్. ఏ. ఏచ్ . ఎలియట్ బొంబాయి' ' గెజటీరులో వ్రాయుచున్నాఁడు.