పుట:Delhi-Darbaru.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

బరోడా రాష్ట్రము.


బరోడా సంస్థానమునకు వరుంబడికి మఱియొక మార్గ ముండెడిది. కాథియ వాడు నందును ఇతర ప్రదేశములందును గల చిన్న చిన్న సంస్థానములనుండి ప్రతి సంవత్సరమును గప్పములు చెల్లుచుండెడివి. వీనిని కప్పములనియుఁ జెప్పుటకు వీలు లేదు. మహా రాష్ట్రులు గొంత రాజ్యము నేలుచు. మఱికొంత రాజ్యము మీఁదికి దండులతోఁ గూడ నెత్తి పోయి ఏటేట చేతికి దొరకిన ద్రవ్యమును . దెచ్చుకొనుచుండుట యాచారము. ఆ యా చిన్న సంస్థానము వద్దకు నీమహా రాష్ట్ర నాయకులు పోవుటతోడనె అచ్చటి పాలకులు గాని" పాలకులు లేనిచో బుర వాసులుగాని ముందు సంవత్సరమునఁ దామిచ్చిన మొత్త మును మఱలఁ జేర్చి దండెత్తివచ్చిన ప్రభువునకు ఊరిబయటి తెచ్చియిత్తురు. ఆ మొత్తము వచ్చిన నింక నెక్కుడు కా వలయుననియుఁ బ్రభువులు కోరుట కలదు. వీరి దాడికి ఓర్వ లేక ఆయా స్వల్ప సంఘముల వారు. వీరి కోరిక ననుసరించి ఇచ్చుటయు గలదు. ఇట్టి కప్పములను వసూలు చేయు కార్యక్రమమునకు ‘ములుక్ గిరి' అని పేరు. గాయిక వాడులు పీష్వాగారితో గూడ నిట్టి ములుక్ గిరి' స్వాతంత్ర్యమును సంపాదించుకొని యుండిరి. వాకరు రెసిడెంటు అయినతరువాత నతఁడు కాథియవాడు, లోనికిఁబోయి అదివఱకు. నాంతరంగిక దుఃఖము వలన గాయిక వాడులు. వసూలు చేయని ములుక్ గిరి పన్ను నంతయును లెక్క లు వేసి సామంతులకు నంతకుఁ బూర్వము నందుంబో లె నన్యా