పుట:Delhi-Darbaru.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

బరోడా రా'ష్ట్ర ము


తన రాజ్యమున దుర్మార్గము సేయువారి నెల్లరను అందునఁ దా నొక్కఁడగుట తటస్థించినచోఁ దన్నుగూడ శిక్షింప ఆంగ్లే యుల కధికార మిచ్చి వేసెను. మేజరువాకరు రెసిడెం టయ్యెను. అరబ్బీలు సర్వస్వతంత్రులుగ నుండినందున బరో డా యందప్పటికి రాజ్యాంగమే యుండ లేదని చెప్పవచ్చనని యొక చరిత్ర కారుఁడు వ్రాయుచున్నాఁడు. ఎట్లైన నేమి. ఆంగ్లే యబలములు బరోడా చొచ్చి అరబ్బీలను వశపరచుకొని వారికి గాయిక వాడు వలన నష్టముగలుగకుండునని యభయమిచ్చి వారి పటాలములను దగ్గించి ఆనంద రావును గద్దె పై స్థిరముగ "నిలుపనలసియుండె. అరబ్బీ సైన్యములకు సంవత్సరమునకు రు 3,00,000 లు అగుచుండెను. ఆంగ్లేయులు బరోడా ప్రవేశించు సప్పటికి ఆరబ్బీలకు రు 20,00,000 అప్పు నిలచియుండె. అసంవ త్సరపు పన్నులును ఆయకమయి పోయియుండెను. కావున అర బ్బీల యప్పులు దీర్చుట కాంగ్లేయ ప్రభుత్వమువారు జమీను జామీనుగఁ బెట్టుకొని ద్రవ్యము నిచ్చిరి. కొంతరక్తము ప్రవ హించిన తరువాత నరబ్బీదండులు విడిసిపోయె. సాహాయ్య సైన్యములు బరోడాయందు నెలకొల్పఁబడెను. 1805వ సం త్సరమున నదివఱకు నాంగ్లేయులకును గాయిక వాడునకును జరిగి యుండిన సంధులలోను ఒడంబడికలలోను వివరించిన విషయ ములను ఒక్కెడఁ జేర్చుటకు మఱియొక నూతన సంధినడి చెను.