పుట:Delhi-Darbaru.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

239

ఆ నంద రా వు.


మల్హరిరావుతో విగ్రహము ప్రారంభమగుటకు ముందు రావ్జీ అప్పాజి ఆంగ్లేయులతోఁ జేసికొనిన యొడంబడిక 1802 వ సంవత్సరము జూలై నెల 20 వ తేది గాయిక వాడువలన వ్రాత మూలకముగ స్థిరపఱుపఁబడెను. దానివలన విగ్రహమున కయిన కర్చెల్లయును ఆనందరావే భరింప నియ్యకొనెను. అరబ్బీల సైన్య మును దగ్గించుటకును మఱి యితర కార్యములకును గాయిక వాడు సీమలో నొక సాహాయ్య సైన్యముంచఁ బడు నట్లేర్ప, డెను. దానికగు వ్యయము నెలకు రు 65, 000లని లెక్కించి అంత ఆదాయముగల 'భూభాగము ఆంగ్లేయుల కప్పగింప వలసినదని దీర్మానింపఁ బడెను. చౌరసి పరగణాయును సూరుతునగరమున గాయిక వాడునకు ' వసూలగు చౌతుపన్నును వారి కర్పింపఁ బడెను. ఇంతియగాక ఆనందరావు దన కాం గ్లేయు లొనర్చిన మాహూపకారమునకుఁ గృతజ్ఞత సూపుటకయి చిక్లీ పరగణాను వారి కినాముగ నిచ్చి వేసెను. గాయిక వాడు బొక్క సమున ద్రవ్యము నుండక పోవుటవలనను భూము లదివఱకే అడుమాన ములు పడియుండుట వలనను ఈసంధివలన నానందరావు, ఆంగ్లేయ ప్రభుత్వము వారికి ఇయ్యవలసివచ్చిన భూములను గుఱించియు చెల్లించవలసిన పైకమును గుఱించియు మఱికొన్ని యొడంబడికలు జరిగెను.దాని విస్తర మిటయనవసరము.. ఇట్లు సైన్యవిషయములను ద్రవ్యాదుల విషయములను కట్టు దిట్టములొనర్చు కొనుటయే గాక యీసంధివలన' నానందరావు