పుట:Delhi-Darbaru.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

237

ఆ న 0 ద రా వు.


ముల నిచ్చు సాహుకారులును, ఆమెను వారించి ఆమెకుమారుఁ డగు ఆనందరావును గాయిక వాడు పదము నధిష్టింపఁ జేసిరి:

ఆనందరావు (1800-1818).

రావ్జీ అహన్ముదా బాదునుండి తీవ్రగతి నేతెంచి రాజ్య భారము నిర్వహింప మొదలిడెను. అయినఁ దండ్రియుండఁగనె రాజ్యమునకై ప్రయత్నించిన కన్ హోజి మిన్నకుండువాడే? అతడుఁ రహస్యమగ బరోడా ప్రవేశించి సోదరునికడ కేగి అతనికి బోధ లొనర్చి యల్ల నల్లన నున్నతోద్యోగములను సంపాదించుకొనెను. అటనుండి సైన్యముల లోఁబఱచుకొనియె. తన్మూలమున రాజ్య శక్తులన్ని యు నాతని చేతనుండిపోయె. వానిని జాగరూకుఁడై యుపయోగించి యుండిన బాగుండి యుండునుగాని స్పల్పబుద్ధు లకు దూరాలోచన యుండదుగదా! కన్ హోజి కైశ్వర్యము గన్ను లఁగప్పి వేసెను. ఆనంద రావు నెడను, రాణిగారియెడను, ప్రభువుల యెడను, సైన్యముల యెడను, జనుల యెడను నతఁడు కాఠిన్యము సూపనారంభించె. అంతటితో నాతని సామర్ధ్యము నశించె. ఒక్క నాటి రేయి అరబ్బీ సైన్యములతని నగరుం జుట్టికొని యత నినిఁబట్టి ఆనందరావున కప్పగించెను. వెంటనే యానందరా నతనిని కారాగృహము పాలు చేసెను.

ఇట్లు కన్ హోజి . రంగమునుండి యదృశ్యుఁడయిన పిదప రావ్జీఅప్పాజి మఱల ప్రముఖుఁడయ్యెను. కాని ' అతని చేత నె పెంచఁబడిన అరబ్బీ సైన్యము లతని కె మ్రింగరానికడియై పరిణ