పుట:Delhi-Darbaru.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

బరోడా రాష్ట్రము.


మయినందునను, రావ్జీఅప్పాజీని ఆ బాతిరస్కరించి మాటలాడి నందునను, అంతటితో సిలువక ఆబా బరోడాగోసాయిల 'మొక కొందఱిని దోచుకోని నందునను, గోవింద రావు ఆబా షెలూకరు పై విగ్రహమునకుఁ బూనెను. ఇది జరుగుచుండఁగనె 1800లో నానాపడ్నవీసు పరలోక ప్రాప్తిఁ జెందెను. పీష్వా బాజీరావున కతని మరణమువలన బరువు దగ్గిపోవ నాతని షక్షము వాఁడగు ఆబాను విడువక తరిమి దీనునిఁ జేయవలసినదని అతఁడు గోవిం దరావునకు వార్త పంపెను. నాలుగు నెలలు పోరాటము జరిగిన పిదప ఆబా షెలూకరును అతని సైనికులే మోసపుచ్చు టవలన నతఁడు గోవిందరావు చేతఁ జిక్కి ఖయిదీ యయి పోయెను. దీని వెనుక గోవిందరావున కధర్మ పుత్రుఁడయ్యును నాతనికిఁ బ్రియుండగు భగవంత రావునకు సంవత్సరమున కైదు లక్షలరూపాయి లిచ్చ నిబంధనతో నామకార్థము అహమ్మదా బాదు గుత్త కీయఁబడెను. రాద్దీ అప్పాజి మిక్కిలి బలవంతుఁడ యియుండి నందున ఆతని కింకను శక్తి నీమెల్లక భగవంతరావు ప్రతినిధిగ సింధియా మంత్రి తమ్ముడగు యాదవరావును అహ మదాబాదునకుఁ బంపుటకు గోవింద రావు ప్రయత్నము సేయు చుండెను. ఇట్లుండఁగ నె అతఁడు 1600 సం|| సెప్టెంబరు నెలలో మృతి నం దెను. అతని భార్య సహగమనమున కుంకించెను. కాని రావ్జీ అప్పాజి తమ్ముఁడు బాబాజియును, మీర్ -కమార్ -ఉద్దీ నును మంగల్ సాముల్ పారక్ అను సైన్యములకు వేతన