పుట:Delhi-Darbaru.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

-234

బరోడా రాష్ట్రము.


“అతని యధర్మ పుత్రుఁడగు కన్హోజి సింధియా యొక్క ప్రోత్సాహ ముచే బరోడాయందు నిలచి తండ్రి నెది ర్చెను. కాని అతని సైన్య ము లేయతనిని బట్టి యిచ్చినందున గోవిందరావు సులభముగ ముఖ్యపట్టణమును జొచ్చి కుమారుని చెఱవెట్టెను. వాఁడును మాయోపాయమునఁ దప్పించుకొని పోయి, కాడి ప్రాంతమున 'జమీందారుగ నుండెనని ఇదివఱకు పేర్కొనఁబడిన ఖండేరావు "నకుఁ గుమారుఁడయి తండ్రి కనంతరము జమీను ననుభవించు చుండిన మల్హర రావుతోఁ జేరుకొని గోవిందరావు నెదుర్ప సమకట్టెను. యుక్తిచే గోవిందరావు వారిరువురకును భేదములు పుట్టించి కష్టోజిని మరలఁ బట్టుకొని కారాగృహమునఁ బడవై చెను. మల్హరిరావు చేయునది లేక గోవిందరావుతో నొడం బడిక చేసికొనియెను. గోవిందరావు కాలమున జరిగిన విషయ ములలో నింకొక్కటియె ముఖ్యముగ నర్ణింపఁబడవలసి యున్నది. నానాఫడ్న వీనునకుఁ బ్రతినిధిగ ఆబా షెలూకరు అహమ్మదా బాదున సుబేదారుగ నుం డెడివాఁడు. నానాఫడ్నవీసు సింధియా చేతులలోఁ జిక్కు పడినప్పుడు గోవిందరావు అహమ్మదా బాదు ను బట్టుకొన వలసినదని యుత్తరువాయెను. అయిన నితనికి ఆబా షెలూకరు నెడ మంచి యభిప్రాయముండుటంబట్టి ఈతని మంత్రియగు రాష్ట్రీ' అప్పాజి పదిలక్షుల ద్రవ్యము గొని అహమ్మ దా బాదును ఆబాకు వదలి పెట్టఁ దీర్మానము చేసికొనెను. కాని ఆ పైకము నిచ్చు విషయములోఁ బోట్లాటలు ప్రారంభ