పుట:Delhi-Darbaru.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

బరోడారాష్ట్ర ము.



మొదలిడిరి. ఫ తేసింగు గోవిందరావునకు అప్పటి బరోడా సంస్థ నమున మూడవవంతు నిచ్చెదనని యొక పర్యాయమును నంత కంటే నెక్కుడిత్తునని మఱియొక పర్యాయమును, వార్త బంపెను. కాని దుర్బోధనల వలన గోవింద రావు వీనికన్నిటికిని పెడచెవి నిడియెను. తరువాత జరిగిన విశేషము లెవ్వి యోమన మెఱుంగము గాని 1778 వసంవత్సరమున ఫతేసింగు బహుస్వ ల్ప ద్రవ్యమును వెచ్చించి పీష్వానుండి సేనాఖాన్ 'ఖేల్ పట్టము నందెను. గోవిందరావు నాఁటినుండి రెండు లక్షల రూపాయిల జహగీరుతోఁ దృప్తిఁ జెందవలసిన వాఁడయ్యెను.

ఫత్తే సి 0 గు (1778-1789).

ఇట్లు ఫతేసింగు గాయిక వాడు పదమున స్థిరపడియెను. ఇతఁడు సింహాసనమునకు వచ్చిన ప్రథమ దినములలో పురందరు సంధివలన మహా రాష్ట్రులచే నాంగ్లేయులకు స్వాధీన పఱుపఁబడి యుండిన బ్రోచి నగరమును మఱల సంపాదించుటకయి విశ్వ ప్రయత్నములు చేసెను. ఆపట్టణము గాయిక వాడునకుఁ జేరిన దగుటచే అతని యుత్తరువు గాని సమ్మతిగాని లేనిది ఇతర మహా రాష్ట్రు లద్దాని నిచ్చకు వచ్చిన ట్లిచ్చి వేయుట న్యాయము గాదని వాదించి దానిని రాబట్టుకొనఁ జూచెను. తనయొద్దనుండి కర్న లు కీటింగు తీసికొనిన ద్రవ్యము విషయమునను గూడ .. నాంగ్లేయులతోఁ గొంత పెనఁగులాడెను. కాని ఫల మేమియు లంభిచినదిగాదు. 1779వ సంవత్సరమున పునహామహారాష్ట్రుల