పుట:Delhi-Darbaru.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు 1.

229


సంధివాక్యములకుఁ బ్రారంభించి జూలై నెల 8 వ తేది యొడం బడిక చేసికొనిరి. దానివలన సయాజి రావు పరముగ ఫతేసింగు రఘునాథ రావునకు సంవత్సరమునకు 8 లక్షలరూపాయి లిచ్చు నట్లును, వలసినప్పుడు మూఁడు వేల సైన్యములు సాహాయ్య మంపునట్లును, ఆంగ్లేయులకు, పీష్యాకును వారికిని జరిగిన సంధి ననుసరించి, బ్రోచి పట్టణపు వరుంబడియును మఱికొన్ని పరగణా లును ఇచ్చునట్లును గోవిందరావుకు ఫతేసింగు సయాజిరావు లేమియు నియ్యనక్కర లేనట్లును ఏర్పడెను. ఇంతేకాక ఫతే సింగు రఘునాధరావునకు రు 26 లక్షలు నరువది దినములలో నిచ్చుట కంగీక రించెను. ఈ మొత్తము కర్నలు కీటింగునకు సైన్య ముల జీతము బత్తెములకు గావలసి వచ్చినందున నతఁడు ఫతేసిం గును అదలించి బెదరించి చాలభాగము వసూలు చేసికొనెను. ఈలోపుగ బొంబాయి ప్రభుత్వము వారు రఘునాథరావుతో జేసికొనిన సంధిని కలకత్తాలోని యాజమాన్య ప్రభుత్వమువారు రద్దు చేయుట సంభవించెను. ద్రవ్యము లాగుటకయి ఈవిషయ మునుగూడ కొంత కాలము గప్పి పుచ్చి కర్నలు కీటింగు ఫతేసిం గునుండి 20 లక్షల వఱకును రాఁబట్టెను. కాని వానలు నిలచి పోయిన తోడనే యాజమాన్య ప్రభుత్వము వారి యుత్తరువు ననుసరించి కర్నలు కీటింగు బరోడా ప్రాంతమువదలి చనెను. రఘునాథరావును అతని వెంబడి నియరిగె. కావున గోవింద రావు ఫతేసింగులు మఱల నొక్కరొక్కరుఁడుగనె పోరాడ .