పుట:Delhi-Darbaru.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

బరోడారాష్ట్ర ము.


గను దానతని ముతాలికుఁడుగను నుండు లాగున ననుజ్ఞఁగొనెను. ఈవిషయము : లింకను 'జరుగుచుండఁ గనె పీలాజి మూఁడవ కుమారుఁడును "కాడి జహగీరుదారుఁడును నగు ఖండేరావు స్వప్ర యోజనమునకయి . దామాజిపుత్రుల - వివాదములలో జోక్య ముకలుగఁ జేసికొని యొక పర్యాయ మొక్కనికిని మఱియొక పర్యాయము మఱియొక్కనికి సాయము చేయుచు దేశక్షోభము కలుగఁ జేయఁజొచ్చెను. ఇట్టిదురవస్థల కాలమున గుజరాతును సంపూర్ణ ముగ పీష్వా మ్రింగి వేయఁగలఁడను జ్ఞానము మంద బుద్ధిగాని ఫతేసేంగుకుఁ గలిగెను. కావున నతఁడు పునహానుండి మహాతృప్తుడు వోలె బరోడా వచ్చి చేరి అటనుండి బొంబాయి యందలి ' ఆంగ్లేయవ ర్తక సంఘము వారితో మైత్రి సంపా దింపఁ బ్రయత్నించెను. అప్పటికది కుదిరినది గాదు. గాని 1778వ సంవత్సరమున బ్రోచి నవాబుతోఁ బోరాడి ఆంగ్లేయు లద్దానిని దీసికొనిన తోడనె వారు ఫతేసింగుతో నాపట్టణమును గుించి సంధి చేసికొనవలసిన వారయిరి. అదివఱకు నవాబు స్వాధీనమున నుండఁగా దాని వరుంబడి యందు గాయిక వాడున కోక భాగము చెందుచుండెడిది. పట్టణము ఆంగ్లేయుల వశమయిన తరువాత గూడ నట్లే జరగవలసినదని ఫతేసింగున కును ఆంగ్లేయవ ర్తక సంఘము వారికిని జరిగిన సంధివలనఁ దీర్మా నింపఁబడెను. దీనికి ఫైఁబడి ఆంగ్లేయులు. ఇతని విషయములలో