పుట:Delhi-Darbaru.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

బరోడా రాష్ట్రము.


గిన' స్నేహమువలన గాయకవాడులకుఁ గట్టకడపట నష్టము వాటిల్లెను. మొట్ట మొదట దామాజి రఘోబాకు సాహాయ్యుఁ డయి పీష్వాగారి సైన్యముల నోడించుచు వచ్చెనుగాని 1768 వ సంవత్సరమున మాధన రావు ' ధోడపు' వద్ద రఘునాధ రావును దామాజ కుమారుఁడగు గోవిందరావుతోఁ గూడఁ బట్టుకొనెను. దామాజి సంవత్సరమునకు 5,25,000 లు కప్పము పీష్వాకు కట్టుటకును శాంతిసమయముల 3000 స్వారులను యుద్ధ సమయ ముల 4900లను ఆతనికయి సిద్ధపఱచి యుంచుటకును పీష్వా మరలించుట 'కియ్య కొనిన కొన్ని జిల్లాలకు గాను రు 2, 54,000లు ఇచ్చునట్లును ఒడంబడిక చేసికొనెను. ఈ యుద్ధమునకుఁ బిదప బహు' స్వల్ప కాలములోనే దామాజి పరలోకమున కేగుట వలన గాయిక వాడుల స్థితి మిక్కిలి హైన్యము చెందిన దయ్యెను.

గో విందరావు (మొదటిసారి). (1768-1771)

దామాజికి నాల్గురు పుత్రులు. అంచు సయాజిరావు అను ప్రథమపుత్రుఁడు వెర్రివాఁడు. రెండవ వాఁడగు గోవిందరావు పున హాయందు ఖయిదీ పోలెనుండె. వీరిరువురును ఇద్దరు భార్యల బిడ్డలు. దామాజిరావునకు మూఁడవ భార్యవలన మరి మువ్వురు కొడుకులుండిరి. పీలాజి, మానాజి, మురారిరావులని వారికి పేళ్లు. "వీరుగాక 'దామాజికీ - రెండవ భార్యవలననో మూఁడవ భార్యవలననో గలిగిన వాఁడు ఫతేసింగను 'నాఱవ : కుమారుఁ'