పుట:Delhi-Darbaru.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

బరోడా రాష్ట్రము



డుంచు కొనుననియును కప్పము క్రింద 5 లక్షల 25 వేల రూప్య ములు పీష్వాకుఁ గట్టుననియును గూడ నితఁ డొప్పుకొనియెను. 1758 వ సంవత్సరమున దామాజియు నితర మహారాష్ట్ర నాయకులును జేరి అహమ్మదాబాదు పై కెత్తిపోయి మహా ధైర్య సాహసములతో డీకొని పోరాడిన జవాన్ మరద్ ఖాన్ బాబిని పరాజితుఁ జేసి ఆనగరమును స్వాధీన పఱచుకొని నాఁటినుండి గుజరాతునందు మొగలాయీల యధికారము నడుగంటఁ జేసిరి. క్షీణింపఁ జొచ్చిన మొగలాయీల నుండి క్రమక్రమముగఁ దీసికొనఁబడు చుండిన భూభాగము పైనుద హరించిన సంధి వలన గాయిక వాడునకును పీష్వాకును సమభా గములుగఁ జేరుచుండెను.

ఇట్లు పీష్వాతో స్నేహము చేసికొనుట నలన నాతని తో బోరాటముదక్కి దామాజి దినదిన ప్రవర్ధమానమగు శక్తిని సంపాదించుకొనెను. 1761న సంవత్సరమున మహా రాష్ట్ర సామ్రాజ్యము సంతరింపఁ జేయుట కేర్పడిన మృత్యు ముఖమో నా సంఘటించిన మూఁడన పానిపట్టు (కురుక్షేత్ర ఘోరయుద్ధమున నిలచి సంగర మొనర్చిన వీరులలో నీ దామా జియు నుండె. తనసాధ్యమగు వఱకు సదాశివరావుభావుకు సాహాయ్య మొనర్చి కార్యముతప్పుట దోఁచిన పిదప నితఁడు అదృష్టవశమున నెట్లో తప్పించుకొని గుజరాతువచ్చి చేరెను. అచ్చట మహమ్మదీయు లదియే సమయ మనుకొని మహా