పుట:Delhi-Darbaru.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

బరోడా రాష్ట్రము.



సేనాపతి శక్తియంతయును నీతని యంద "నిలిచియుండె. ఇట్లు సర్వవిధముల - బలమెక్కుచుండిన సమయమున 'దామాజి' మాళవముమీఁదికి నెత్తిపోయియుండెను.. అంతలో మోమిను ఖాను పరలోకమున కరుగ నతని తావున ఫయా-ఉద్దీను నియ మింపఁబడి యుండెను. అతఁడు మహారాష్ట్రుల యెడ విరోధ భానము వహించి రంగోజి నెదిర్చి యోడించెను. కాని దామాజి, మాళవమునుండి నచ్చిన తోడనే మహారాష్ట్రులకు మంచి యదృష్టము పట్టెను. ఫయా-ఉద్దీను దేశ భ్రష్టుడై- పరు గెత్తవల సె. “ పెట్లాడు. రంగోజీవశమయిపోయె. అహమ్మదా బాదు నగరమున గాయకవాడులకు ఒక భాగము దామాజి సోదరుఁడగు ఖండేరావుచే సంపాదింపఁ బడియె. సూరతు పట్ట ణము విషయమున ననేకములగు నంతః కలహములు ప్రా ప్తించుచుండి నందున “దామాజికీ' 1751 వ సంవత్సరమున నా నగరపు వరుంబడిలోఁ గొంత భాగము ఇయ్యఁబడునట్లేర్పడెను.

రాజా 'సాగోజి' మరణముతో మహా రాష్ట్రమున శక్తి యంతయును పీష్వా “బాలాజి' చేతులలోనికిఁ బోయెను. పునహా మహా రాష్ట్ర సామ్రాజ్యమునకు రాజధాని యయ్యెను. రాణీ సావిత్రీబాయికిని ' బాలాజి' కిని బద్ధవైరము. ఆమె కొల్హా పురపు రాజుగ నుండిన ‘సాంభాజి' కి మహారాష్ట్ర సామ్రాజ్యాధిపత్యమును ఇప్పించ వలెనని ప్రయత్నించి అందుకు ,సాహాయ్యముగ 'దామాజి' ని రమ్మని వేడెను. 1751వ