పుట:Delhi-Darbaru.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'214

బ రో డా రాష్ట్ర ము.


అతని క్రింది యధికారులలో నొక్కండగు దామాజిగాయిక వాడు తన ప్రావీణ్యముచేఁ బ్రాముఖ్యము నంది షంషర్ బహ దూరు అనుబిరుదమునం దెను. ఆపట్టము నేఁటికిని గైకవారుసుత తివారు వాడుకొనుచున్నారు. 1721వసంవత్సరమున ఖండే రావును దామాజియును నిద్దఱును బరలోక ప్రాప్తి జెందిరి. ఖండేరావునకు త్రయంబక రావను నతఁడు కుమారుఁడు గలఁడు. 'దామాజిపేరు నిలుపుట కతని సోదరుని కుమారుఁడగు 'పిలాజీ చాలియుండెను.

పీ లా జి (1721-1732).

ఇతఁడే బరోడా సంస్థానమునకు మూలస్థాపకుడు. గాయిక వాడులకు పునహామండలము లోని ధావడి మొదటి నివాసస్థానము. కాని వారు సేనాపతికడ నధికార స్థానమున కేర్ప డిన పిదప నాగ్రామము వదలవలసినవారైరి. ప్రారంభమున గాయికవాడులు సేనాపతికి వేగులవారుగ నుపచరించుచుండి రను కథయొకటిక లదు. అయినఁ దరువాతి వృత్తాంతముల నను సరించి చూడఁగ. వీరు సేనాపతి క్రింద గౌరవనీయమగునధికారము లలోనే చాల కాలముండిన ట్లగుపించుచున్నది. పీలాజీగాయిక వాడు మొదట ప్రస్తుతపు ఖాండేషు జిల్లాలోని నవాపురమందు ఏబది స్వారులకు నాయకుఁడుగ నగుపడుచున్నాఁడు. కార్యసా ధనాశ క్తివలన నీతఁడు రెండుమూఁడు వందలస్వారులకు నాయ కత్వమున కెక్కి సూరతు పట్టణమును గొనుటలో విజయుఁడయి