పుట:Delhi-Darbaru.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

199

కిషన్. ప్రసాదు.


వలెనని అభిప్రాయపడియెను. అందుచే నాసంవత్సరమున అట్టి రక్షక సైన్యమున కై అరువదిలక్షల రూపాయలు దానిత్తుననియు యుద్ధముదప్పక పోయినచోఁ దానె స్వయముగఁ గత్తికట్టుకొని బయలు దేరుదుననియు గవర్నరు .జనరలుగారికి 1887 లో, వ్రాసి ఆంగ్లేయ లోకమును భ్రమింపఁ జేసెను.

నైజాము కొంతకాలము రాజ్యభారమునంతయును తానే నిర్వహించి నవాబు బషీరుద్దాలా సర్ ఆసక్ జాబహదూ రును మంత్రిగా నియోగించుకొనెను. ఆరు సంవత్సరములు పని చేసి అతఁడును రాజీనామానిచ్చెను. సర్ విక్ర-ఉల్ - ఉమ్రా మంత్రి పదమునకు నియోగింపఁబడెను. అతనికిఁ దరువాతివాఁడె ప్రస్తుతపు ముఖ్యమంత్రియగు మహారాజు సర్ కిషన్ ప్రసాదు.

మహారాజా సర్ కిషన్ ప్రసాదు.

ఈ మంత్రి కాలమున నాంగ్లేయులకును నైజామునకును గల సంబంధములలో ఒక ముఖ్యమగు మార్పు కలిగెను. బీరారు విషయమున సర్ సాలారుజంగు పడిన పాట్లును వానివలన నతనికి వచ్చిన యపకీర్తి ఇదివరకే వర్ణింపఁబడెను. ఆబీరారు విష యమె ఈమంత్రి కాలమునఁ దీర్మానింపఁబడిన ముఖ్య విషయము. 1858వ సంవత్సరమున నైజాము బీరారును ఆంగ్లేయుల పరిపాలన క్రిందికి చేర్చినది మొదలు ప్రతి సంవత్సరమును కర్చులు పోఁగ మిగత యున్న ద్రవ్యము నైజామున కీయ్యఁబడవలసి యుండెను గదా! బీరారున నాంగ్లేయు లుపక్రమించిన పరిపాలనా పద్ధతి