పుట:Delhi-Darbaru.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

హైదరాబాదు సంస్థానము.


బాలురు విదేశములకుఁ బోయి ఉన్నత విద్యనభ్యసించుటకు సదుపాయము , లేర్పఱుపబడెను. వైద్య శాస్త్రమును స్త్రీలకుఁ గఱపుటకును శాస్త్రీయమగు పద్ధతుల నవలంబించు దాదులను సిద్ధపఱచుటకును ఉచితమగు నేర్పాటు లొనర్పఁ బడెను. దేశ మంతటను వైద్యశాలలు నెలకొల్పఁబడెను.

సూరుమహబూబ్ ఆలీ సింహాసనమునకు నచ్చిన తోడనె రెండవ సాలారుజంగు మంత్రియయ్యెనని నుడివితిమి. వీరిరువు రకును యజమానియు సేవకుఁడుగ మైత్రికుదిరినదిగాదు. "కావు న సాలారుజంగు 1887 న సంవత్సరమున రాజీనామాని చ్చెను. నాఁటినుండి కొంత కాలము - నైజాము దనకుఁదానె మంత్రిగఁ గార్యముల నెర వేర్పదొడంగెను.

ఔదార్య కార్యము.

భరతవర్షమున ': కెప్పుడును పశ్చిమో త్తరపు సరిహద్దు వలన బాధ దప్పినదిగాదు.అందున నాంగ్లేయ ప్రభుత్వము స్థిరపడిన తరువాత నావైపునుండి రుష్యావారు దండెత్తివత్తు రేమో యను. భీతి 1 [1]కడుంగడు హెచ్చఁ జొచ్చెను. 1885 వ సంవత్సర మున రుష్యా సైన్యములు ఆఫ్ఘనిస్థానము మీఁదికి దాడి వెడల నుండెనను వార్తప్రబలెను. అట్టివార్త లె దినదినమును వ్యాపించు చుండినవి. కావున నవ్వానినన్నిటిని యోజించి నైజాము పశ్చి మోత్తరదిగ్భాగపు సరిహద్దునందు వలసినంత రక్షుక సైన్యముండ ........................................................................................

1

  1. ఆది వట్టి భీతియనుట లోకమునకు విదితమయి' యున్న C.