పుట:Delhi-Darbaru.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋణ ప్రదాతల యొ త్తిడి.

167


దనుక పరిశ్రమఁ జేసి యీయవస్థ మూడకుండునట్లు చేసికోన నిచ్ఛగలవాఁడయి నైజూము 1851వ సంవత్సరము జూన్ మాస ములో సురాజ్-ఉల్ ముల్క్ ను రెండవమారు ముఖ్యమంత్రిగ నేర్పఱచికొని రెసిడెంటుతో ఋణమున నర్థభాగము వెంటనె తీర్పఁబడుననియుఁ దరువాత నక్టోబరు మాసాంతమునకుఁ దక్కిన యర్థభాగము దీర్పఁబడుననియు నొక్కి చెప్పెను. తన సైన్య మునకు నగు వ్యయములను గ్రమముగ నిచ్చుటకొఱకు కొన్ని తాలూకాల వసూలును ప్రత్యేకించి పెట్టితినని కూడ నుడి వెను. దీనినంతయునువిని 'రెసిడెంటు మనస్సమాధానమునంది కొంత కాలము వేచియుండ నియ్యకొనియెను. ఆగస్టు 15వ తేది నైజాము దన వాగ్దానము ననుసరించి మొదటి కిస్తీని గట్టి వేసెను. 1[1] అప్పటికి రు 32, 97, 702,లు బాకీయుండెను. ఆ మొత్తమును దీర్చుట కేర్పడిన వాయిదా గడచి పోవుటతోడనే రెసిడెంటు ఆసంగతిని గవర్నరు జనర లునకుఁ దెలియఁ జేసెను. నైజాము అప్పంతయుఁ దీరువవలయునను దీక్షతోనున్న వాఁడను నమ్మ కము దట్టినందున గవర్నరు జనరలు నైజాము చేసిన నాగ్దాన ములకు సమ్మతించుచు కిస్తీలమీఁద పైకమును దీసికొనుట కంగీ కరించెను. కాని కొంత భామీయఁబడినందునఁ దక్కిన భాగ మీయకున్నను తొందర లేదని నైజాము దలంపకుండును గాత .............................................................................

1.

  1. ఈ కిస్తీకి గాను సైజాము దన యాభరణములను ఇంగ్లాండున గుదువఁ బెట్టించెను.