పుట:Delhi-Darbaru.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

హైదరాబాదు సంస్థానము.


గుజించియు ఆంగ్లేయులకును ఫెంచి వారికిని వచ్చిన సంఘర్ష ణముల వలన నది బ్రద్దలగుటను గూర్చియు వర్ణింపఁ బడియెను, ఆదండులకు సమకాలికముగను తరువాతను నైజాము వద్ద పేరువడసిన యరబ్బీలు, సవాళులు, మక్సబు దారులు, రోహలా లు, సీక్కులు, తుర్కీ- వారు మొదలగుబుటులు ఏబది వేల కుం, డెడివారు. వీరందఱును నైజాము స్వంత సిబ్బందీలో చేరిన వారు. వీరికతఁడె జీతముబ త్తెముల నిచ్చుచుండెడి వాడు. ప్రప్రథ మముస వీరుపయోగ కారులుగనుండుచు యుద్ధములలోఁ దమ యజమానునికి మహోపకారులుగ నుండిరి.. కాని సాహాయ్య సైన్యమును నైజాము సైన్యమును జక్కఁగ నేర్పడిన తరువాత వీరికంత అనుభవానుకూలములు లేకపోవుట వలన వీరురాను రాను పొగరుబోతు లై నైజామునకే అపకారులగు సంత స్థితికి వచ్చియుండిరి. కాని వీరలకియ్య వలసిన వేతనములు మాత్ర ము నైజామున కియ్యక దీరకుండెడిది. ఇట్లు వర్ణితమగు నీసం దర్భములను బట్టియు నటనట సూచింపఁ బడిన ఇతర కారణ ములను బట్టియు నైజాము నార్థిక స్థితి (Financial condition, పలుమారు అతనికి వ్యసములు దెచ్చి పెట్టు చుండెను.

ఋణ ప్రదాతలయెత్తిడి.

నైజాము ఆంగ్లేయ వర్తక సంఘము వారికి అప్పుపడి యుండిన మొత్తము 1850 వ సంవత్సరము డిసెంబరు 31 న తేదీకి లోపుగ నియ్యవలసినదనియు అట్లు చేయని