పుట:Delhi-Darbaru.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరిగి చందూలాల్ దుష్పరిపాలన.

155.


జూచుచుండ లేమనియు అప్పటి ముఖ్యమంత్రి న్యాయమై దిట్టమగు పరిపాలనకుఁ దగినఏర్పాటుల నొనర్పఁడేని అమంత్రినిమార్చి. యవసరమగు నితర కార్యముల నెర వేర్చనలసియుండునని నైజా మును ఆంగ్లేయ ప్రభుత్వమువారు నిర్బంధ పెట్టవలసిన వా రగుదుర నియు నైజామునకుఁ దెలియఁ జేయ వలసినదని యుత్తరువుఁ బంపిరి.

దీనిపై చందూలాల్ ఏవోయొక కొన్ని మార్పు లాం గ్లేయ ప్రభుత్వము వారు జోక్యముకలుగఁ జేసికొని చేసిన బాగుం డునని నుడివెను. కాని దానికి నైజా మియ్యకొనఁడయ్యెను. *[1] అప్పుడు తాలూకుదారులు మున్నగు క్రింది యుద్యోగస్తులు దురా గతములకుఁ బోకుండఁ గని పెట్టుటకు అమీను లనువారు నేమిం పఁబడిరి. కాని వీరును విద్య లేని హీనజను లేగావున నీఏర్పా, టువలన నదివఱకుండిన దుర్మార్గుల సంఖ్యకు నింకను గొందఱు- చేర్చఁ బడిరి. ఇట్లగుట కొలఁది కాలములో నే నైజాము రాజ్యాంగ ము దురవస్థలయందు సంపూర్ణముగ మునిగిపోయెను. అప్పు లు రానురాను మెండయ్యెను. ఆదాయము లేదాయెను. చందూ లాల్ కొంత కాలము తనచాకచక్యమువలన రాజ్యభారము నిర్వహించెను. కాని హైదరాబాదునందలి సాహు కారుల కత ని పై నమ్మక ముదప్పి తమ బాకీలు దమకిచ్చి వేయ వలసినదని తొం

......................................................................................

  • ఒక చరిత్రకారుఁడు నైజాము ఒప్పుకొనకుండునట్లు చేసినదికూడ చందులాలే యనుచు న్నాడు.