పుట:Delhi-Darbaru.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సి క ం ద రు జా.

143


యూపిరి వెడలుటె యాలస్యముగ సికందరుజాను సింహాసనము పై కెక్కించుటకు సర్వసన్నాహములును జేయఁబడియుండెను. కాని నైజామలీ మరల బ్రతుకుటవలన నవెల్లయుఁ బనికి రాకపోయెను, అయిన నప్పుడు సికందరుజాకొసఁగిన షరత్తులే 1800 సంవత్సరపు సంధిలో నైజూ మలీకిని నొసంగఁబడి యతనిచే నంగీకరింపఁ బడెను. ఇట్లదివఱకె యాంగ్లేయుల సంరక్షణకు లోఁబడియుండ నెంచి కొనిన సికందరుజా1808వ సంవత్సరమున నై జామలీఖానుఁడు మరణించఁగ నే అల్లరులును గడబిడలును నేమియు లేక. నైజాముపదమున కెక్కెను.

సికందరుజా (1808_1829).

సింహాసనము నెక్కినపుడితని వయస్సుముప్పది నాలుగు సంవత్సరములు. ఇతఁడు .సౌలభ్యమును సుఖమును అపే క్షించి ప్రజల కష్టసుఖములను గమనింపఁ డయ్యెను. ఇతఁడు సింహాసనమునకు నచ్చునప్పటికి సిందియా హెల్కారుల పరస్పర సంఘట్టనమువలన రేగిన ప్రథమ మహా రాష్ట్ర యుద్ధము జరుగుచుండెను. 1808 వ సంవత్సరము అక్టోబరు నెల 25 వ తేది పునహాయొద్ద యుద్ధములో సింధియాయును నతనికి సహ కారిగఁ బోరుచుండిన పేష్వాయును హెల్కారుచే నోడింప బడిరి. పేష్వా, సంపూర్ణమగు నాశమును దప్పించుకొనుటకయి యాంగ్లేయులతో సహవాసము గోరెను. కావున నాతనికిని వీరికిని నైజామునకును వీరికి నిం బలె అదేషరత్తులతో సంధి.