పుట:Delhi-Darbaru.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంధికిఁగారణములు.

133


మార్క్విసు అఫ్ వెల్లెస్లీ ఆంగ్లేయులకు గవర్నరు జనరలుగా వచ్చునప్పటికి రేయిమండు పటాలములు నిండుస్థితి యందుండెను.

సంధికిఁగారణములు.

టిప్పూసుల్తానుతో మరల విగ్రహము తటస్థించునట్లుం డె ను. మహా బలశాలియగు టిప్పుసుల్తానుతోఁ జంచల చిత్తులయిన వైజాము మహా రాష్ట్రులను దోడు చేసికొని పోరఁగడఁగు నాం గ్లేయులకు, నైజాముయొక్క బలవంతమగు ప్రెంచి సైన్యమును దమదండులో నొక్కయంగముగ స్వీకరించుట కుక్కతోఁక పట్టుకొని గోదావరియీద సాహసించుటయె యయియుండును గదా. కావున మార్క్విసుఆఫ్ వెల్లస్లీ నైజామును ఫ్రెంచి సైన్య ములఁ బగులఁగొట్టుమని వేధింపఁజొచ్చెను. కాని నైజామునకు మాత్రము దన బలమును దగ్గించుకొనుట కేనూత్రమును ఇష్ట ము లేకుండెను. అట్టిసందర్భముల నొకటి రెండువిషయములు తటస్థింపకున్నచో నైజామునకును నాంగ్లేయులకును నంతత్వరగ స్నేహము గుదిరియుండదు. కాలపరిపక్వమహిమవలన నప్పుడే రేయిమండక సాత్తుగఁ జచ్చుట దటస్థించెను. అతఁడు విషము చేతఁ జచ్చెనను వదంతిగలదని యొక చరిత్రకారుఁడు వ్రాయు చున్నాఁడు. '[1] నైజామునకు ముఖ్యమంత్రిగ నుండి యతని క్షేమ మునకయి (hostage) ప్రతిభుఁడుగ మహా రాష్ట్రుల వద్ద బహుకా లము ఖైదీ వలెనుండిన ఆజమ్ - ఉల్ - ఉమ్రా మిక్కిలిచాతు

.....................................................................................

  1. 1 Malleson---Native States of India-