పుట:Delhi-Darbaru.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా రాష్ట్రులు డీకొనుట

129

.

పైనె త్తినచ్చిరి. అప్పుడితఁడు గవర్నరు జనరలుగారిని సాయ మడిగెను. మహారాష్ట్రులును ఆంగ్లేయులకు మిత్రులేయయి యుండినందున నతఁడు సైన్యముల యుద్ధభూమికిఁ బంపడయ్యెను. దానినలన నైజామునకుఁ గోపమువచ్చి ఆంగ్లేయులు దనకితర వేళల సాహాయ్యర్ధమయి తన వద్ద నుంచిన రెండుపటా లములను తిరుగఁగొట్టి తనతమ్ముడు బజలత్ జంగునుండి సంపాదించిన ఫ్రెంచి పటాలములకు నింకను గొందఱును జేర్చికొని " రేయిమండు' అను ఫ్రెంచి నాయకు నొక్కరుని నియమించి మహా రాష్ట్రుల నెది ర్చెను. ఇట్లు చేయుటలో తానుఆంగ్లేయుల సాయ మిఁకెప్పు డును గోరక స్వతంత్రుఁడుగా నుండవలె ననుటయే యాతని యభి ప్రాయము.

నైజాముయొక్క యీయభిలాష నెర వేరియుండినచో హైదరాబాదు చరిత్రమే మారిపోయి యుండును. కాని తిరుగఁ గొట్టఁబడిన ఆంగ్లేయపటాలములు దారిఁ బట్టిపట్టకమునుపె నైజా మలీ కుమారుఁడు ఆలీజా తండ్రిపై తిరుగుబాటొనర్చెను. పాపమతఁడు దండ్రి చచ్చునఱకు వేచియుండ లేక పోయెను గాఁబోలు. తండ్రి బుద్ధి కడపటి కెట్లు పరిణమించునోయని సందియ పడియెఁ గాఁబోలు. లేదేని తనతండ్రి యన్నను జంపి రాజ్యము నకు వచ్చెఁగావునఁ దానును దన తండ్రి మార్గము నవలంబింపు కున్నఁ దనకును రాజ్యము రాదని తలంచె నేమొ? ఏయూహతో నైన నేమి? అతఁడు దండ్రిని సమయించి సింహాసనము నాక్రమింప